కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు
గ్రామాల్లో అర్హుల పేర్లు డిస్ ప్లే చేయాలి.. అన్యాయం జరిగితే చర్యలు తప్పవు....
క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్.
భీమదేవరపల్లి మే 08(ప్రజామంటలు)
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ,రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన 58 వ,పుట్టినరోజు సందర్భంగా గురువారం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘనంగా స్వాగతం పలికి అనంతరం మంత్రి వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తకొండ లో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ చేత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.2014 నుంచి 2023 డిసెంబర్ వరకు పది సంవత్సరాలలో హుస్నాబాద్ నియెాజకవర్గానికి 1237 డబుల్ బెడ్ రూంలు సెలక్షన్ చేయగా అందులో 443 మాత్రమే ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేశారు.పది ఏళ్లలో నియెాజకవర్గంలోని మండలాల్లో భీమదేవరపల్లి జీరో, సైదాపూర్ జీరో, ఎల్కతుర్తి జీరో,కొహెడ జీరో,అక్కన్న పేట జీరో, అన్నారు. నియెాజకవర్గంలోని 200 ఇండ్లు మాత్రమే
ఒక హుస్నాబాద్ టౌన్ లో 168 ఇండ్లు, ఒక సైదాపూర్ లో 20 ఇండ్లు ప్రోగ్రెస్ లో చూపించారన్నారు. ఎక్కడ ఒక ఇల్లు కట్టలేదు.ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంది. సంబంధించి ఎంపిక ప్రక్రియ గ్రామాలలో వీటిని పేదలల్లో పేదలకు ఇవ్వాలి అన్నారు ఎందుకంటే ఇల్లు కావాలని చాల డిమాండ్ ఉంది.ఆర్హులు కూడా చాలామంది ఉన్నారు దానికి నేను ఒప్పుకుంటా, కానీ అందులో నియెాజకవర్గానికి 3500 పూర్తిగా పంచాలన్నప్పుడు జనాభా ప్రకారం 100 మందికి ఒకటి వస్తుంది. కానీ మళ్లీ రెండు నెలలకు మల్ల 3500 ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి.మల్ల నెక్స్ట్ ఇయర్ కు 3500 ఇందిరమ్మ ఇల్లు అందరికీ వస్తాయి. ఓపిక పట్టండి మేము అందరికీ ఇస్తాం,కానీ గ్రామాల్లో అధికారులు కానీ రాజకీయాలకు అతీతంగా ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హులకు ఎంపిక చేయాలని చెప్తున్నా .గ్రామాల్లో అర్హుల పేర్లు డిస్ ప్లే చేయాలని అన్నారు.ఇళ్ల ఎంపిక వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు ఉపయెాగపడాలి అని సూచించారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో భూ భారతి మెడల్ గా అక్కనపేట మండలం ఎంపిక అయిది.సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది.సిద్దిపేట జిల్లాలో కొత్తగా 46 వేల మందికి రేషన్ ద్వారా సన్న బియ్యం వచ్చాయి. అని తెలిపారు.
ఎవరైనా గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల జోక్యంలో అధికారులు కానీ మా కార్యకర్తలైన లీడర్లైన బ్రోకర్లైన ఒక్క రూపాయి తీసుకున్నట్లయితే నేనే దగ్గరుండి క్రిమినల్ కేస్ పెడతానని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్ని హామీలు అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట్టెంపెల్లి ఐలయ్య, కొత్తకొండ దేవస్థానం చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా,యూత్ మండల అధ్యక్షులు జక్కుల అనిల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ కొలుగూరి రాజు,ఆదరి రవి,బొజ్జపురి అశోక్ ముఖర్జీ, ఊస కోయిల ప్రకాష్,చిదురాల స్వరూప,పిడిచెట్టు కనకయ్య,గజ్జల రమేష్,చిట్కురి అనిల్, నగర బోయిన నాగరాజు, కాంతారావు, గజ్జల సురేష్, మురళి, సుదర్శన్ రెడ్డి, మాడుగుల సంపత్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రోడ్డు భద్రత నియమాలు పాటించడం మనందరి భాద్యత * జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)
జిల్లాలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో“జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026” బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026 బైక్ ర్యాలీని జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్... విద్యుత్ సమస్య ఎదురైన వెంటనే సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 1912 ను సంప్రదిస్తే త్వరతగతిన సమస్యని పరిష్కరిస్తాం ఏఈ. సంతోష్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు) విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తైసిల్ చౌరస్తాలో 'ప్రజా బాట' కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వినియోగ దారులకు అవగాహన కల్పించారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై ఏఈ సంతోష్, రాంజీ నాయక్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు భద్రత నియమాలు పాటిస్తూ జాగ్రత్త వహించాలని, నాణ్యమైన విద్యుత్
వినియోగదారులకు... జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ కరువు హై కోర్ట్ న్యాయవాది వి.రఘునాథ్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)నేడు మన దేశంలో న్యాయం కోసం ఆరాటపడే జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని సీనియర్ హై కోర్టు న్యాయవాది వి.రఘునాథ్ అన్నారు. జగిత్యాలలో ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడారు.
దేశంలో నాలుగవ స్తంభం జర్నలిస్ట్ లని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయవాదులను, జర్నలిస్టులను... జాతీయ సదస్సులో పాల్గొన్న వెనుగుమట్ల ఉపాధ్యాయుడు
గొల్లపల్లి జనవరి 8 (ప్రజా మంటలు) నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా భాగస్వామ్యంతో అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్టీసీ) అనే సంస్థ ‘ఈనాడు’తో కలిసి గురువారం హైదరాబాద్లో ‘శాస్త్ర విజ్ఞానాన్ని ప్రయోగశాల నుంచి సమాజంలోకి తీసుకెళ్లడంలో సమాచార పాత్ర - వికసిత్ భారత్-2047 నిర్మాణం’ అనే ఇతివృత్తంతో,మాజీ ఉపరాష్ట్రపతి
సైన్స్... మేడారం జాతరకు కేసీఆర్కు ఆహ్వానం
సిద్ధిపేట, జనవరి 08 (ప్రజా మంటలు):మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావును జాతరకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర మహిళా మంత్రులు ఆహ్వానించారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, మహిళా మరియు శిశు సంక్షేమ... బ్రాహ్మణులపై దాడికి నిరసనగా డిజిపి కి బ్రాహ్మణ సంఘాల నాయకుల ఫిర్యాదు.
హైదరాబాద్ జనవరి 8 ( ప్రజా మంటలు)బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో గోదావరి హారతి అర్చకులుగా పనిచేస్తున్న బ్రహ్మశ్రీ దీక్షిత్ సాయి కళాధర్ శర్మ పై మూడు రోజుల క్రితం కొందరు దుండగులు పథకం ప్రకారం దారుణంగా దాడి చేశారు పరుష పదజాలంతో దూషిస్తూ చాలా ఘోరంగా పిడిగుద్దులతో దాడి చేశారు.
ఇటీవల... శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా విశ్వక్సేన ఇష్టి గణపతి అభిషేకం
జగిత్యాల జనవరి 8 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీ ధనుర్మాస ఉత్సవ సందర్భంగా లోక కళ్యాణార్థమై భగవత్ భాగవత ఆచార్య అనుగ్రహ ప్రాప్తికై, గురు వారం 8 వ రోజు నవహనీక, ఏకకుండాత్మక, విశ్వ క్షేనఇష్టి మూలమంత్ర హవనం , గణపతి... భోలక్పూర్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటన
సికింద్రాబాద్, జనవరి 8 (ప్రజా మంటలు):
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం భోలక్పూర్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలతో ఆయన ఆత్మీయంగా మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్థానికులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా, కేవలం పది నిమిషాల్లోనే ఒక యువతి... కవితపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు: తెలంగాణ జాగృతి
హైదరాబాద్ జనవరి 08 (ప్రజా మంటలు)::
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న తప్పుడు, అసత్య ప్రచారం చేస్తున్నాడని తెలంగాణ జాగృతి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్, నాయకులు ఆనంద్, మాధవి మీడియాతో మాట్లాడారు.
అగ్గిపెట్టె... సమస్యల అధ్యయనానికి జాగృతి మరో 12 కమిటీలు
హైదరాబాద్ జనవరి 08 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై లోతైన అధ్యయనం చేసి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ రూపొందించాలనే లక్ష్యంతో జాగృతి సంస్థ మరో 12 కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 32 కమిటీలను ప్రకటించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం తాజాగా ఈ... సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
జగిత్యాల జనవరి 07 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని శ్రీ గాయత్రీ అనాధ వృద్దాశ్రమంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ సంక్రాంతి పర్వదినం విశిష్టతను తెలిపి,,వయో వృద్ధుల చట్టం పై... తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి బ్లూప్రింట్ సిద్ధం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ జనవరి 07 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి బ్లూప్రింట్ రూపొందిస్తోంది. ఈ దిశగా “పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం – సంపూర్ణ అధ్యయనం” సహా 30కి పైగా అంశాలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయిమెంట్, రైతులు, ఎస్సీ–ఎస్టీ–బీసీ–ఎంబీసీ సాధికారత, మహిళలు, యువత, మైనార్టీలు, గల్ఫ్ కార్మికులు,... 