సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్
. సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113
జగిత్యాల మే 5 ( ప్రజా మంటలు)
సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని,
ప్రాచీన కాలం నుండి శాస్త్ర, సాంకేతిక, వైద్య, విజ్ఞాన రంగంలో భారత్ దేశమే అగ్రగామిగా ఉండేదని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. జగిత్యాల వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ శంకర్ మాట్లాడుతూ భారత దేశంలో మేధోసంపదకు కొదవ లేదని అయితే మేదో సంపత్తిని వెలికి తీసే నాయకత్వం అవసరమని తెలిపారు. ఆర్యభట్ట, భాస్కరాచార్య, వరాహమిహిర, శుశ్రుతుడు, కణాధుడు లాంటి ప్రాచీన శాస్త్రవేత్తలు ప్రపంచానికి అవసరమైన ఎన్నో ఆవిష్కరణలు అందజేశారని తెలిపారు. ఆధునిక కాలంలో కూడా జగదీష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం, నంబి నారాయణన్ లాంటి వారు మన వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక రంగాలను బలోపేతం చేశారని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోని 21 అగ్రశ్రేణి కంపెనీలకు సీఈవోలుగా భారతీయులే ఉన్నారని తెలిపారు. స్వదేశంలో మన మేధావులకు సరైన ప్రోత్సాహం లభించకపోవడంతో భారతీయుల మేధో సంపదను ఇతర దేశాలవారు ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిసరాలను, ప్రకృతిని నిశితంగా పరిశీలించడం ద్వారా, కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ద్వారా మేధో సంపద వికసిస్తుందని తెలిపారు. ప్రస్తుత కాలంలో కంప్యూటర్ విద్య తెలియని వారిని ఎన్ని డిగ్రీలు ఉన్నా నిరక్షరాస్యులు గానే పరిగణిస్తారన్నారు. రోజురోజుకు శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు కంప్యూటర్ విద్యను అభ్యసించాలని సూచించారు.
వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 35 రోజుల పాటు నిర్వహించే ఉచిత కంప్యూటర్ శిక్షణలో 125 మంది విద్యార్థిని విద్యార్థులు శిక్షణ పొందనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త కోటగిరి అరవింద్ హాజరుకాగా వాల్మీకి ఆవాసం అధ్యక్షులు జడిగే పురుషోత్తం, కార్యదర్శి నందెల్లి మదన్ మోహన్ రావు, కమిటీ సభ్యులు సంపూర్ణ చారి, కంప్యూటర్ శిక్షణ ఇన్చార్జ్ బెక్కం మల్లేశం బొమ్మెర సత్యనారాయణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్పార్టీయే

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం
