గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్‌పార్టీయే
కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
సికింద్రాబాద్ మే 05 (ప్రజామంటలు):
రానున్న జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి పార్టీని గెలిపించాలని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ లు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశం సీతాఫలమండి బీఎన్ఆర్ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, పార్టీ అసెంబ్లీ పర్యవేక్షకుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, శంషాబాద్ మాజీ సర్పంచ్ సిద్ధేశ్వర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ మాట్లాడుతూ... రానున్న జీహెచ్ఎమ్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడుగా పని చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలుతో ప్రజలలో పార్టీ పట్ల సానుభూతి పెరిగిందని పథకాలే ప్రచారస్త్రాలుగా వినియోగించుకొని జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలని కోరారు.
అదం సంతోష్ మాట్లాడుతూ నియోజకవర్గములో పార్టీ పటిష్టత కోసం చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించడం జరుగిందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయడం, కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని చెప్పారు. బూత్‌స్థాయిలో కాంగ్రెస్‌కార్యకర్తలు టార్గెట్‌లు పెట్టుకొని పనిచేయాలని కోరారు.నాయకులు అమర్నాథ్ గౌడ్, సందీప్ రాజ్, షకీల్, జలందర్ రెడ్డి, కిషోర్ యాదవ్, డివిజన్ అద్యక్షులు అనిల్ కుమార్, అభిషేక్, రవి, బ్రహ్మాజీ, గంట రాజు సాగర్, ప్రభాకర్, సతీష్, జగ్గూ, సురేష్ లాల్, మహేందర్, శంకర్, వహీద్,పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్‌పార్టీయే

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం
