ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 9 (ప్రజా మంటలు)
భారత దేశం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని, దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని, వారికి దైవికంగా మంగళాశాసనములు అందించడానికి గాను జిల్లా కేంద్రంలోని టవర్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో అర్చకులతో పాటుగా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజమౌళి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక సభ్యులు మంచాల రాంగోపాల్, గౌరిశెట్టి రాజు, బాశెట్టి లవకుమార్, గౌరిశెట్టి వెంకన్న, శ్రీరామమందిరం సభ్యులు రుద్రంగి గోపాల కృష్ణ, ఆలయ ఉద్యోగి రుద్రాంగి భాను తదితరులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమం అనంతరం గత నెల 22 న ముష్కరుల చేతుల్లో హతులైన పహాల్గమ్ మృతులకు సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతరెడ్డి తోపాటు మంత్రివర్గం, యువత సంఘీభావం పలుకుతూ, చేపట్టిన కార్యక్రమంకు తోడుగా దేవాదాయ శాఖ పక్షాన ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని, దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని, వారికి దైవికంగా మంగళాశాసనములు అందించడానికి గాను చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలందించాలని, దేశానికి వెన్నెముకగా నిలిచిన ప్రధాని నరేంద్రమోడీకి ప్రతి ఒక్కరూ సంఘీభావంగా నిలవాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
