సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్
సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు):
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని అంతా వినియోగించుకోవాలని సికింద్రాబాద్ మహాంకాళి బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. న్యూ బోయిగూడ ఎంఎన్కే విఠల్ సెంట్రల్ కోర్టు రూప్ టాప్ టెర్రస్ పై నూతనంగా ఏర్పాటు చేసిన 36 కేడబ్ల్యూపీ కెపాసిటీ సోలార్ పవర్ ప్లాంట్ ను ఆయన బుధవారం రాత్రి ప్రారంభించారు. సోలార్ పవర్ తో అటు కరెంట్ బిల్లులు ఆదా అవడంతో పాటు ప్రభుత్వ కరెంట్ డిమాండ్పై ఒత్తిడి తగ్గుతుందన్నారు. రూ18లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ6.50 లక్షల సబ్సిడీ ఇవ్వగా, అపార్ట్ మెంట్ ప్లాట్ నివాసితులు రూ11.50 లక్షలు కంట్రిబ్యూషన్ ఇచ్చారని అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ హనుమాన్లు తెలిపారు. కొచ్చి ఏయిర్ పోర్టు గత 10 ఏండ్లుగా కేవలం సోలార్ పవర్ తోనే నడుస్తుందని, కాని కొందరికి ఇప్పటికి సోలార్ పవర్ పై అపోహాలున్నాయన్నారు. పర్యావరణ హితమైన సోలార్ పవర్ మంచిదన్నారు. తమ 90 ప్లాట్ల అపార్ట్ మెంట్ లో కామన్ కారిడర్స్,మూడు లిఫ్టులు, మూడు వాటర్ పంపులు, సెల్లార్ విద్యుత్ అవసరాలకు సోలార్ పవర్ ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.సబ్సిడి ఇచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోలార్ ప్లాంట్ తో తమకు ప్రతినెలా రూ45 వేలు ఆదా అవుతాయన్నారు. ఉత్పత్తి అయిన పవర్ లో వాడుకోగా, మిగిలిన పవర్ ను ప్రభుత్వ పవర్ గ్రిడ్ కు విక్రయిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ర్ట ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రామోజీ, సికింద్రాబాద్ లోక్సభ పార్టీ ఇంచార్జీ టి.రాజశేఖర్ రెడ్డి, నాయకులు సురేశ్, శివలింగం, కిరన్,సేతు మాధవరావు, వి.శ్రీనివాసన్, సుధీర్బాబు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
