సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
జగిత్యాల మే 5(ప్రజా మంటలు )
సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటానని,వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు.సోమవారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన వయో వృద్ధుల సంరక్షణ చట్టం అవగాహన అంశాల గోడ పోస్టర్లను,కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ సేవలను గుర్తించి గత కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాతో మాట్లాడి ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఉన్న శిథిలావస్థకు చేరిన ఒక గదిని మంజూరు చేయించి నిధులు మంజూరు చేయించానన్నారు.జిల్లాలో సీనియర్ సిటీజేన్స్ కేసులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సత్వరం పరిష్కరిస్తున్న జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ ను ,సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తదితర సంఘ ప్రతినిధులను అభినందించారు..అనంతరం సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ సీనియర్ సిటీజేన్స్ కు ప్రత్యేకముగా ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేయించాలని,తల్లిదండ్రులు,వృద్ధుల సంరక్షణ చట్టంలో 2019 లో కేంద్రం చేసిన సవరణలను పార్లమెంట్ లో ఆమోదించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తేవాలని తదితర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఎమ్మెల్యే కు విన్నవించారు
.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షుడు పి.హన్మంత రెడ్డి,నాయకులు దిండిగాల విఠల్,వెల్ముల ప్రభాకర్ రావు, ఎం.డి.యాకూబ్,మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగం జలజ,మాజీ కౌన్సిలర్లు పంబాల రాం కుమార్ క్యాదాసు నవీన్,కూసరి అనిల్ కుమార్, బద్దం జగన్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్

ఘనంగా కొనసాగుతున్న అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు
