రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామo లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ" పాదయాత్ర వర్షకొండ గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి విచ్చేశారు, ఈ సందర్భంగా జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం పై ప్రతిజ్ఞ చేయించారు,
అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తామని సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తులును అవకాశాల్లోనూ మానవత్వాన్ని కల్పించడానికి కులమాత ప్రాంత వర్మ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగ కల్పించిందని అన్నారు.
ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తూ సమాజంలో అసాధ్యులే నెలకొల్పుతున్నాయని విభేదాలు సృష్టిస్తూ రాజకీయం మనగాడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయన్నారు, ఇలాంటి తరుణంలో శాంతి అహింసను మూల సూత్రాలుగా మనకు బోధించే మహాత్ముడి స్ఫూర్తిగా మనసులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించడానికి డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను అమలు చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకితభావంతో అహర్నిశలు కృషి చేయాలన్నారు, రాజ్యాంగాన్ని రచించింది కాంగ్రెస్ పార్టీ అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ అని రాజ్యాంగాన్ని పరిరక్షించేది కూడా కాంగ్రెస్ పార్టీ యేనన్నారు, అలాంటి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జై బాబు, జై భీమ్, జై సమ్మిదాన కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఇంటింటికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి గ్రామంలో ర్యాలీ నిర్వహించాలన్నారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ అని అన్నారు, కాంగ్రెస్ పార్టీ చేపట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని కోరారు,
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల మార్కెట్ కమిటీ చైర్మన్ బోరుగం రాజు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు దుదిగం గంగాధర్,,మాజీ ఎంపీపీ నేరెల్ల దేవేందర్, మాజీ ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు పొనకంటి వెంకట్, జలేశ్, బోల్ల వోయిన శంకర్, విజయ్, మనోజ్, రమేష్,శివారెడ్డి,నల్ల రమేశ్,ఏ ఎం సి డైరెక్టర్లు తిప్పిరీ అశోక్,బూస రాజేశ్వర్, వేముల సుగునాకర్ రావు,కాస ప్రశాంత్,రెబ్బటి శేఖర్, మీబండి రాజేశ్, నల్ల రామరాజు, వాల్గొట్ నరేష్, మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ..
More News...
<%- node_title %>
<%- node_title %>
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో ప్రత్యేక పూజలు

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్
