మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం
చీరతో ఎంట్రీ, ప్యాంట్ షర్ట్ తో ఎగ్జిట్
*సీసీ టీవీ ఫుటేజీలతో లేడీని పట్టుకున్న పోలీసులు
*రూ8లక్షల నగదు,గోల్డ్,సిల్వర్, అర్నమెంట్స్ స్వాధీనం
సికింద్రాబాద్ మే 31 (ప్రజామంటలు) :
తనకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువుల ఇండ్లే టార్గెట్ గా, వారు ఇంట్లో లేని సమయాల్లో మారువేషం ధరించి రాత్రి వేళలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడుతున్న కిలాడీ లేడిని వారాసి గూడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుండి 8 లక్షల విలువైన నగదు బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య తెలిపారు.
వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డమీద విజయ అనే మహిళ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 23వ తేదీన వారాసి గూడ లో దుర్గా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేసినట్లు వెల్లడించారు..దొంగతనం చేసే క్రమంలో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీరలో వచ్చి దొంగతనం చేసి మారు వేషంలో బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.
చీరలో వచ్చిన విజయ ఇంట్లో తాళాలు పగలగొట్టి అల్మారలో ఉన్న నగదు విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు చీరను విడిచి, ప్యాంట్ షర్ట్ మాస్క్ ధరించి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
తీర్థయాత్రల కోసం బాధిత కుటుంబం శ్రీకాళహస్తికి వెళ్లిన నేపథ్యంలో దొంగతనం జరిగినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వారాసి గూడ పోలీసులు 500 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితురాలు విజయ ను పట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇదివరకే దుర్గా కు విజయ పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
గతంలో పలు దొంగతనం కేసుల్లో విజయ నిందితురాలని పోలీసులు పేర్కొన్నారు. కేసును చేధించిన పోలీస్ సిబ్బందిని అడిషనల్ డీసీపీ అభినందించారు. మీడియా సమావేశంలో చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి,వారాసిగూడ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.
