కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన
కాళ్లకు హీట్ ప్యాడ్స్ పెడితే చర్మం ఊడి వచ్చింది
సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు చూలాలి అవస్థలు
సికింద్రాబాద్ మే 30 (ప్రజామంటలు):
కూకట్పల్లిలోని అంకుర్ ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూడు రోజుల క్రితం డెలివరీ కోసం వచ్చిన ఘటన మరువక ముందే మరో నిండు చూలాలు సిబ్బంది నిర్లక్ష్యానికి గురై అవస్థలు పడుతుంది. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంపేటలో నివసిస్తున్న సంధ్య(26) అనే మహిళ ఈనెల 22వ తేదీన అంకుర్ ఆసుపత్రిలో డెలివరీ కోసం చేరింది.
అదే రోజు డాక్టర్స్ సిజేరియన్ చేస్తే ట్విన్స్ పుట్టారు. ఆ తర్వాత సంధ్యను ఐసీయూకు షిఫ్ట్ చేశారు. ఈమె చలి ఎక్కువగా ఉందని చెప్పటంతో రెండు కాళ్లకు సిబ్బంది హీట్ ప్యాడ్స్ కట్టారు. ఆ తర్వాత ఈ విషయం మర్చిపోయారు. అరగంట తర్వాత బాధితురాలికి మత్తు వదిలి కేకలు పెట్టటంతో సిబ్బంది వచ్చి హీట్ ప్యాడ్స్ తీసేశారు. అప్పటికే సంధ్య రెండు కాళ్లు బొబ్బలు ఎక్కి, చర్మం ఊడిపోయింది. ప్రస్తుతం ఆమె అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేషంట్ పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది , యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
