బాలల హక్కుల కోసం పనిచేస్తున్న ఆశ్రిత సంస్థకు జాతీయ స్థాయి అవార్డు
సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు) :
బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో ఉత్తమ సంస్థ అవార్డు లభించింది. అమెరికాలోని వరల్డ్ లా కాంగ్రెస్ వరల్డ్ జురియస్ట్ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు, 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్' వ్యవస్థాపకుడు భువన్ రిభు చేతుల మీదుగా ఢిల్లీ లో జరిగిన సమావేశంలో తాను ఈ అవార్డు అందుకున్నానని ఆశ్రిత సంస్థ డైరెక్టర్ ఎస్.నాగరాజ తెలిపారు.
హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అక్రమ రవాణా అరికట్టడానికి తాము చేసిన కృషికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం తమకు ఎంతో ఆనందంగా ఉన్నదని నాగరాజు అన్నారు. దేశవ్యాప్తంగా 250 స్వచ్ఛంద సంస్థలతో నడుస్తున్న జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ లో తమ ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ కూడా భాగస్వామి కావడం తమకు సంతోషంగా ఉన్నదని నాగరాజా అన్నారు. 2008 నుండి తమ ఆశ్రిత సంస్థ, జిల్లా బాలల సంక్షేమ కమిటీ, మరియు జిల్లా సంక్షేమ విభాగం,జిల్లా బాలల రక్షణ విభాగం, పోలీసులు, కార్మిక శాఖ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో ఇల్లు వదిలి పారిపోయిన పిల్లలను చేరదీసి, తిరిగి కన్నవారికి అప్పగించడం, ఎవరూ లేని వారికి ఆశ్రయం కల్పించి, చదివించడం, బాల్య వివాహాలు అరికట్టడం, బాలల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అక్రమ రవాణా నివారించడానికి పని చేస్తున్నామని నాగరాజ తెలిపారు. జాతీయ స్థాయిలో అవార్డు రావడంలో తమ సంస్థ సిబ్బంది కృషి కూడా ఉన్నదని ఆయన అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
