మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో గల నర్సింగ్ కళాశాలలో షీ టీం, ఏ హెచ్ టి యూ, భరోసా టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
విద్యార్థిని విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ సైబర్ నేరానికి గురి అయినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు. సైబర్ నేరాల గురించి విద్యార్థులు తమ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు ఇరుగుపొరుగు వారికి సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.అదేవిధంగా జిల్లాలో మహిళలు హక్కులు , రక్షణకు షీ టీం ప్రత్యేకంగా పనిచేస్తుందన్నారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేసిన, ర్యాగింగ్ చేసిన కఠిన చర్యలు ఉంటాయని స్కూల్లో, కళాశాలలో, బస్టాప్ ఇతర నిర్మాణ ప్రాంతాలు ఎవరైనా అమ్మాయిలను వేధిస్తే షీ టీం పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 87126 70783 కు లేదా డయాల్ 100 కు కాల్ చేయాలన్నారు. అదే విధంగా షీ టీం పని విధానం, పొక్సో ఆక్ట్, ఈవిటిజింగ్, ర్యాగింగ్,గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అమ్మాయిల వేధింపులు, పై అవగాహన కల్పించారు.
యొక్క కార్యక్రమంలో సి సి ఎస్ ఎస్.ఐ రవీందర్, మహిళా కానిస్టేబుల్స్ సౌజన్య, భరోసా సిబ్బంది, మరియు ఉపాధ్యాయులు, విద్యార్థిని లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
