జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.
త్వరలో డివిజన్ల వారిగా పాదయాత్రలు
*ఎంపీ అనిల్ కుమార్, ఆదం సంతోష్ వెల్లడి..
సికింద్రాబాద్ మే 22 (ప్రజామంటలు) :
రాబోవు జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ కుమార్ లు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ అధ్యక్షతన మెట్టుగూడా, అడ్డగుట్ట, తార్నాక డివిజన్ల ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ మాజీ సర్పంచ్ సిద్ధేశ్వర్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ శ్రేణులు వివరించాలని, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై అవగాహన కల్పించాలని, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండాలని పేర్కొన్నారు.
అదం సంతోష్ మాట్లాడుతూ..ఏడాది కాలంలో ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసింది అని రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తుందని, జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీలో విజయమే లక్ష్యంగా పని చేయాలని, అందుకు పార్టీ కార్యకర్తలు కీలకమని స్పష్టం చేశాడు. డివిజన్ అధ్యక్షులు బ్రహ్మాజీ, రవి, గంటరాజు, అమర్నాథ్ గౌడ్, కిషోర్ యాదవ్, శిల్పా చారి, గుంటి కృష్ణ, రమేష్, హరి, పర్వేజ్, శేఖర్, శశాంక్, బెన్నా, నిస్సార్, బాబా, అశోక్, సిద్ధులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
