హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

On
హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు - గోదావరి తీరాన భక్తుల గుడారాలు

(రామ కిష్టయ్య సంగన భట్ల)

 పవిత్ర గోదావరినది తీరాన వెలసిన పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రం బుధ వారం భక్త జన సంద్రంగా మారింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన స్థానిక దైవాలు శ్రీలక్ష్మి నరసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వరుల రథోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రం నలు మూలలనుండే గాక, సుదూర ప్రాంతాల నుండి సనాతన వారసత్వ సాంప్రదాయా చరణలో భాగంగా, ఏతెంచిన ఆశేష భక్త, యాత్రికజనం భగవన్నామ స్మరణలతో, జయజయ ధ్వనాలతో క్షేత్రం ప్రతిధ్వనించింది. భక్తులు పవిత్ర గోదావరిలో మంగళ స్నానాలు ఆచరించి, ప్రధానాలయాల ముందు బారులుతీరి వేచి ఉండి దైవ దర్శనాలు చేసుకుని, మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం ఎస్.ఈఓ శ్రీనివాస్, ట్రస్టు బోర్డుఅధ్యక్షుడు జక్కు రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో, రథోత్సవం సందర్భంగా దేవస్థాన  పౌరోహితులు పురుషోత్తమా చార్య, ఆస్థాన వేద పండితులు రమేశ్ శర్మ ఆచార్యత్వంలో వివిధ ఆలయాల అర్చకులు ముందుగా యోగానంద, ఉగ్రనారసింహ, శ్రీవేంకటేశ్వ రాలయాలలో నిత్య పూజలు నిర్వహించారు. మద్యాహ్నం  నుండి సాయంత్రం వరకూ దేవస్థానం ముందుంచిన మువ్వురు స్వాముల యోగ ఉగ్రనారసింహ, వేంకటేశ్వరులను ఆసీనులు గావించగా భక్తులు. నిచ్చెనల ద్వారా అధిరోహించి, మొక్కులు చెల్లించు కున్నారు. రధాల చుట్టూ అష్ట దిక్పాలకులను పూజించి రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం చక్రతీర్థ కార్యక్రమార్ధం, మంగళ వాద్యాలతో, వేదమంత్రాలతో, దేవస్థాన బాధ్యులు, అర్చకులు, భక్తులు తోడు రాగా, గోదావరి నదిలో మంగళ స్నానాలు గావించి, క్షేత్ర ప్రదక్షణ ఆచరించి, దేవస్థానానికి తిరిగి వచ్చారు. ఆలయాలలో మహా నివేదనం చేసి పుష్పయాగం (నాగవెల్లి)ని నిర్వహించారు. పుష్ప యాగము, గోపాల, వాసుదేవ, శంఖ పూజలు, శ్రీవత్సకౌస్తుభ, ద్వాదశ దేవతా, పురుష, నారాయణ సూక్త నామార్చనలు గావించారు. శ్రీలక్ష్మి నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం పక్షాన రథోత్సవం సందర్భంగా  భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని వేలామంది వినియోగించు కున్నారు.  స్వామి వారల రదోత్సవం సందర్భంగా వందలాది భక్తులకు పులిహోర ఉచితంగా పంపిణీ చేసి, త్రాగు నీరందించారు. త్రాగునీరు, బటర్ మిల్క్ పంపిణీ  చేశారు. బ్రహ్మోత్సవాల ముఖ్య దినమైనందున, నదీస్నానం పుణ్యమని భావించే భక్తులు గోదావరి నదీ స్నానాలకై సుదూర ప్రాంతాలనుండి ఉదయాత్పూర్వమే క్షేత్రానికి చేరుకున్నారు. దక్షిణాభిముఖంగా ప్రవహిస్తు విశేష గోదావరిలో వేలాదిమంది భక్తులు, స్థానికులు  మంగళ స్నానాలు ఆచరించారు.

రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు 

రాష్ట్రంలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా, గోదావరి తీరస్థ పవిత్ర తీరంగా పేరెన్నికగన్న ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ (ఉగ్ర, యోగానంద), శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్ట సందర్భంగా తాత్కాలిక టెంట్లు, క్యూలైన్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వివిధ డిపోల నుండి నడిపిన ఆర్టీసి బస్సులను గుణంగా క్రమబద్ధీ కరించారు. ధర్మపురి సి ఐ రాం నర్సింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్, సిబ్బంది ప్రణాళిక బద్ధంగా వ్యవహరించారు.

గోదావరి తీరాన భక్తుల గుడారాలు

 ఏటా 13రోజులపాటు సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్స వాలకు సనాతన వంశాచార వారసత్వ ఆచరణలో భాగంగా సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు, యాత్రికులు ధర్మపురి క్షేత్రానికి అరు దెంచి, ఇక్కడ ఉత్సవాలలో పాల్గొ నడం అనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి క్రమం తప్పకుండా భక్తులు రావడం, మొక్కులు చెల్లించుకోవడం జరుగున్నది. సంవత్సరం పొడువునా మహారాష్ట్ర భక్తులు వస్తుండడం సత్సంప్రదాయారణ కాగా,  ఈఏడు భక్తుల సంఖ్య ద్విగుణీకృతమైంది. క్షేత్రంలో నివాస, బస వసతులు సరి పోని స్థితిలో కొన్ని రోజులు ఇక్కడే మకాం వేసి, ఉత్సవాలలో పాల్గొన గోరే భక్తులు గోదావరి నది తీరాన తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు. ఎండ వేడిమిని తట్టుకుని, కొంతైనా రక్షింప బడేందుకు వెదురు కర్రలను, పైన కవరులను ఉపయోగించి నిర్మిం చుకున్న తాత్కాలిక నివాస యోగ్య గుడారాలు నిలువ నీడనిస్తున్నాయి.

IMG_20250319_185131

బ్రహ్మోత్సవ వేడుకలలో పాల్గొన డానికి సుదూర ప్రాంతాలనుండి విచ్చేస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా దాహార్తిని తీర్చేందుకు పురపాలక సంఘం, దేవస్థానం, ఆర్టీసీ, అన్నపూర్ణ, గాయత్రీ అన్నదాన సత్రం, ఎస్ బి ఐ, మద్ది కిషన్  పక్షాన పలువురు స్థానికులు వివిధ ప్రదేశాలలో త్రాగు నీటి సరఫరా కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా కోనేరు వద్ద పెండ్యాల  మహేందర్  ఏర్పాటు చేసిన సౌకర్యాన్ని కోనేటికి తెప్పోత్సవాలకు వచ్చిన భక్తులు అధి కంగా వినియోగించు కున్నారు.  దేవస్థానం లోపల క్యూలైన్ల భక్తులకు శీతల జలాన్ని అందిస్తున్నారు.

Tags

More News...

Local News 

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా...
Read More...
Local News 

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్. 
Read More...
Local News 

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*   భీమదేవరపల్లి మే 9 (ప్రజామంటలు) : హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, ఉపాధ్యక్షులు చిట్కూరి అనిల్ రక్తదానము చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి సేవ...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి  శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం  మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి...
Read More...
Local News 

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు.. సికింద్రాబాద్, మే 08 (ప్రజామంటలు): పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ఆర్మీ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఆపరేషన్ తో...
Read More...
Local News 

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్  

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలోని 735 సర్వే ప్రభుత్వ భూమిని కొంత భూమిని క్రీడా మైదానానికి ( మినీ స్టేడియం) కేటాయించాలని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ విప్ ను  మండలానికి చెందిన క్రీడాకారులు కోరగా,గురువారము ఆర్డీవో మదు సుదన్, తాసిల్దార్ వరందన్, ఆర్ఐ అనూష,సర్వేయర్ మోకా పైకి వచ్చి...
Read More...
Local News 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  ఉగ్రమూకల ఉన్మాదచర్య తో  ఊపిరి విడిచిన ముద్దుబిడ్డల *"గని" *  అంతులేని వేదన తో  ఉలుకుపలుకు లేక నిస్తేజంగా నిలిచిన పెహల్గాం పుడమితల్లి....   తీరని దుఃఖం తో ఎరుపెక్కిన కళ్లతో సమైక్య బలం చాటిన భారతీయుల భావోద్వేగాలుముష్కరుల పాలిట యమపాశాలు కాగా ఉగ్రవాద...
Read More...
Local News 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్                                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 ( ప్రజా మంటలు)    అధిక శబ్దం కలిగించే 130  ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ద్వంసం     రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించి జిల్లా పోలీసులకు సహకరించండి    శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను గత...
Read More...
Local News 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని రామ్ బజార్ లో గల వాసవి మాత ఆలయంలో వాసవి మాత జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, ఉత్సవమూర్తికి పల్లకి సేవ, ఫల పంచామృత అభిషేకం, వసంత రుతువులో లభ్యమయ్యే, ఆమ్ర, పలరసాభిషేకం నిర్వహించారు. మాతలు విశేష సంఖ్యలో  సామూహిక...
Read More...
Local News 

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం జగిత్యాల మే 7, ప్రజా మంటలు  విశ్వహిందూ పరిషత్  ఆధ్వర్యంలో జగిత్యాల నగర సేవా ప్రముఖ ఎలగందుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ కుట్టుమిషన్ శిక్షణ కేంద్రంలో మహిళలు మూడు నెలలు ట్రైనింగ్ పొందుతారు.ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వబడుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩 భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : వాసవి మాత జయంతి సందర్భంగా అంచురీస్ కన్వెన్షన్ హాల్లో ఆర్యవైశ్యులందరు, వాసవి మాతకు కుంకుమ పూజలు నిర్వహించారు. మన దేశం శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలని వాసవి మాతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అంచూరి వెంకట్రాజము, గౌరవ అధ్యక్షులు పెద్ది సూర్య ప్రకాశం, కార్యవర్గ సభ్యులు...
Read More...
Local News 

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు) : ఉగాండా కు చెందిన యువతి వ్యభిచారం చేస్తూ బోయిన్ పల్లి పోలీసులకు పట్టుబడింది. బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రాజు తెలిపిన వివరాలు...మబ్జి షరాన్(23)అనే యువతి ఉగాండా దేశంలోని కోకో మేర్ ప్రాంతం నుంచి గత ఏడాది ఫిబ్రవరి21న టూరిస్ట్ వీసాపై ముంబై కి వచ్చింది. అక్కడి నుంచి...
Read More...