సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం
*అగ్నిలో బుగ్గి అయిన ఎస్బీఐ బ్యాంకు అడ్మినిస్ర్టేటివ్ బిల్డింగ్ 4 వఫ్లోర్
*ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది..
*సెలవు రోజు కావడంతో తప్పిన ప్రాణనష్టం..
సికింద్రాబాద్ మే 04 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బీఐ భవనం నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్నఫైర్ సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.... సికింద్రాబాద్ పాట్నీసెంటర్లోని ఎస్బీఐ భనవం నాలుగో అంతస్తులో ఎస్బీఐ బ్యాంకు లోన్లకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. అయితే ఆదివారం సాయంత్రం భవనం నాలుగో అంతస్తు నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, పెద్ద ఎత్తునమంటలు చెలరేగడంతో అటుగా వెళుతున్న వహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అగ్ని ప్రమాద సంఘటపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. సంఘటనా స్థలానికి భారీ క్రేన్ను తెప్పించిన ఫైర్ సిబ్బంది క్రేన్స్ సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు నాలుగో అంతస్తునుంచి కిందకు రాకుండా ఉండేందుకు ఫోమ్ తో స్ర్ఫే చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనానికి చుట్టు పక్కల పలు వ్యాపార సముదాలు కొనసాగుతున్న భవనాలు ఉన్నందున ఆ భవనాలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేశారు. నాలుగో అంతస్తులో పూర్తిగా బ్యాంకు లోన్లకు సంబంధించిన వ్యవహారాలు ఉండటంవల్ల అందులో చాలా ఎక్కువా ఫర్నీచర్ ఉందని, ఈ ప్రమాదంలో బ్యాంకుకు చెందిన ఫర్నీచర్ తో పాటు బ్యాంకు లోన్లకు సంబంధించిన కీలకమైన ఫైళ్లు అంతా పూర్తిగా కాలిపోయినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించారు. విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆదివారం బ్యాంకుకు సెలవు కావడంతో బ్యాంకు ఆఫీసులో బ్యాంకు ఉద్యోగులు సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
వర్కింగ్ డే అయి ఉంటే పెద్ద ప్రాణ నష్టం వాటిల్లి ఉండేదని ఫైర్ అధికారులు,బ్యాంకు అధికారులు చెప్పారు. అయితే ప్రమాదానికి గల కారణాలు పూర్తి స్తాయిలో తెలియక పోయినప్పటికీ బ్యాంకులో షార్క్ సర్య్కూట్ వల్లనే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
సమాచారం అందగానే ఘటన స్థలానికి చేరుకున్నాం..
–ఫైర్ ఆఫీసర్ శ్రీదాసు
సికింద్రాబాద్ ఫైర్ ఆఫీసర్
ప్యాట్నీ సెంటర్లోని ఎస్బిఐ అడ్మినిస్ర్టేటివ్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సాయంత్రం7 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది..వెంటనే మా సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకున్నాం. బిల్డింగ్ నాల్గవ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ మిగతా అంతస్తులకు వ్యాప్తి చెందకుండా వెనకే ఉన్న అపార్ట్మెంట్స్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నాం. ప్రమాద సమయంలో మనుషులు ఎవరు బిల్డింగ్ లో లేరు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మొత్తం ఐదు ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నాం.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ

ఘనంగా "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
