కుల గణనలో కుల సంఘాలు యాక్టివ్ గా పనిచేయాలి
బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్
సికింద్రాబాద్ ఫిబ్రవరి 25 (ప్రజామంటలు) :
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణన ప్రక్రియను కుల సంఘాలు సవాలుగా స్వీకరించి, యాక్టివ్ గా పనిచేస్తూ, వందశాతం కులగణన సాధించాలని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ కోరారు. ఆయన మంగళవారం సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ ఆదం సంతోష్ కుమార్ తో కలసి సీతాఫల్మండి జె.ఎం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...ఎన్నికలు జరిగే సందర్బాల్లో కులాల రిజర్వేషన్ అంశం తెరపైకి వస్తుందని, అప్పుడు కోర్టులు ప్రభుత్వాలను అసలు ఆయా కులాల జనాభా ఎంత అని ప్రశ్నిస్తాయని అన్నారు.
అప్పుడు ప్రభుత్వాల వద్ద కుల గణనపై సృష్టత లేనట్లయితే ఎన్నికల నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో రూరల్ లో 22 శాతం, అర్బన్ లో 27 శాతం రిజర్వేషన్లను బీసీ లకు ఖరారు చేస్తే వారు దాదాపు 44 శాతం సీట్లు గెలిచారన్నారు. అదే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తే దాదాపు 65 నుంచి 70 శాతం వరకు గెలిచే అవకాశం ఉండేదన్నారు.
కులగణన అనేది కేవలం ఎన్నికల అంశం ఒక్కటే కాదని, ఆర్థిక, సామాజిక, స్థితిగతులకు కూడ ఈ కులగణన సర్వే ఎంతో ఉపకరిస్తుందన్నారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఓసీలకు ఇది ఎంత మాత్రం వ్యతిరేకం కాదని, ఎవరి మద్య మనస్పర్థలు రాకుండా కులసంఘాలు ఐక్యత ప్రదర్శించాలని కోరారు. 50 శాతం రిజర్వేషన్ మించి రావాలంటే రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టవలసి ఉంటుందన్నారు. ఒక వేళ ఇది జరిగే అవకాశం ఉన్నప్పుడు మన కుల గణన డేటా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారులు, సిబ్బంది, నాయకులు ఆదం సృజన్, డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, షకీల్, వహీద్, చక్రధర్, సూర్య ప్రకాశ్, కల్పన, రాజేందర్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)