కిమ్స్ -సన్‌షైన్ హాస్పిటల్ -లో రీనల్ డెనర్వేషన్ థెరపీ సెంటర్ ఏర్పాటు
సికింద్రాబాద్ ఏప్రిల్ 09 (ప్రజామంటలు):
దేశంలోనే మొట్టమొదటిసారిగా బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో మెడ్రానిక్ సంస్థతో కలిసి రీనల్ డెనర్వేషన్ థెరపీ (Renal Denervation Therapy) క్లినిక్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ హెడ్ ఆఫ్ కార్డియాలజీ & కార్డియోథోరాసిక్ సర్జన్ డా. శ్రీధర్ కస్తూరి తెలిపారు.
బుధవారం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో ప్రపంచస్థాయి వైద్య సాంకేతికత రంగంలోని ఒకటైన మెడ్ట్రానిక్ సంస్థతో కలసి రీనల్ డెనర్వేషన్ థెరపీ (Renal Denervation Therapy) కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ భాగస్వామ్యం మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (MoU) ద్వారా అధికారికంగా కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. బి. భాస్కర్ రావు మాట్లాడుతూ.... "సాంప్రదాయ చికిత్సలతోనూ నియంత్రణలోకి రాని హైపర్ టెన్షన్ నేడు అత్యంత తీవ్ర ఆరోగ్య సమస్యగా మారిందని, మెడ్ట్రానిక్‌తో మేము చేస్తున్న ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఆధునిక, ఆధారిత చికిత్సలను అందించడంలో విప్లవాత్మక ముందడుగుగా నిలుస్తుందన్నారు.
ఇది కేవలం సాంకేతికత విషయమే కాదు, ఇది మా వైద్యులకీ, రోగులకీ సమగ్ర శిక్షణ, జ్ఞానం మరియు అనుభవాలను కలిసివచ్చే హోలిస్టిక్ కేర్ వ్యవస్థను నిర్మించాలనే దిశగా ముందుకు తీసుకెళ్తోందదని, తాము హైపర్‌టెన్షన్ నిర్వహణకు కొత్త ప్రమాణాలను స్థాపించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవి గురవారెడ్డి మాట్లాడుతూ "ఈ భాగస్వామ్యం తో నియంత్రించలేని రక్తపోటుతో బాధపడే రోగులకు ఆధునిక చికిత్సను అందించాలనే ప్రయత్నంలో ఒక గొప్ప ముందడుగు అన్నారు. మెడ్ట్రానిక్ సంస్థ అందించే టెక్నాలజీని తమ నైపుణ్యత్వంతో కలిపి, హైపర్‌టెన్షన్ నిర్వహణలో కొత్త యుగానికి దారితీస్తున్నామన్నారు. తమ లక్ష్యం కేవలం వైద్య ఫలితాలను మెరుగుపరచటం మాత్రమే కాదు, ఔషధ చికిత్సలకు మించి శాశ్వతమైన పరిష్కారాలను అందించడం ద్వారా రోగులను శక్తివంతులుగా చేయడమే అన్నారు.
మెడ్ట్రానిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ ప్రెసిడెంట్ మందీప్ సింగ్ కుమార్ మాట్లాడుతూ "మెడ్ట్రానిక్‌లో, మేము స్థిరమైన ఆవిష్కరణలు మరియు సమర్థవంతమైన భాగస్వామ్యాల ద్వారా ఆరోగ్య సంరక్షణను రూపాంతరం చేయాలనే నిబద్ధత కలిగి ఉన్నామని తెలిపారు. కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్‌తో భాగస్వామ్యం ద్వారా, మెడికల్ ప్రొఫెషనల్స్‌కు అభివృద్ధి చెందిన శిక్షణను అందించడమే కాకుండా, రీనల్ డెనర్వేషన్ థెరపీపై అవగాహన పెంచడానికీ ఇది దోహదపడుతుందన్నారు.
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ హెడ్ ఆఫ్ కార్డియాలజీ ఆండ్ కార్డియోథోరాసిక్ సర్జరీ డా. శ్రీధర్ కస్తూరి మాట్లాడుతూ... హై బీపీ ( అధిక రక్తపోటు) కారణంగా హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, పక్షవాతం, మెదడులో రక్తస్రావం సంభవిస్తున్న 100 మరణాల్లో 10 మరణాలు ఉంటున్నాయని తెలిపారు. అడల్ట్స్ లో ప్రతి ముగ్గురిలో ఒకరికి హైబీపీతో బాధపడుతున్నారని ఐ సి ఎం ఆర్ గైడ్లైన్స్ ప్రకారం తెలుస్తుందన్నారు. మీడియా సమావేశంలో కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్స్ సి ఓ ఓ సుధాకర్ జాదవ్ తో పాటు కార్డియాలజిస్టులు డాక్టర్ శైలేందర్ సింగ్, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ కావ్యతో పాటు వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
