పసుపుకు మద్దతు ధరను ప్రకటించాలి - ధర కోసం నిజామాబాద్ జిల్లా కలక్టరేట్ ను దిగ్భందిస్తాం - ఎమ్మెల్సీ కవిత

On
పసుపుకు మద్దతు ధరను ప్రకటించాలి - ధర కోసం నిజామాబాద్ జిల్లా కలక్టరేట్ ను దిగ్భందిస్తాం - ఎమ్మెల్సీ కవిత

చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను సమర్పిస్తున్న రేవంత్ రెడ్డి
ప్రజా భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ తర్వాతే బనకచర్ల ప్రాజెక్టును ప్రకటించిన చంద్రబాబు నాయుడు.

నిజామాబాద్ లో పసుపు మార్కెట్ IMG-20250222-WA0541యార్డును సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ ఫిబ్రవరి 22:

ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణగా కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఉన్న ప్రేమ తెలంగాణ రైతాంగంపై ఎందుకు లేదని రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. తెలంగాణ రైతుల కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబే ఎక్కువనా అని ప్రశ్నించారు. బ్యాగులతో దొరికిన రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని, అందుకే చంద్రబాబు చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

శనివారం నాడు నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డును ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. అక్కడ పసుపు రైతులతో మాట్లాడి వారి కష్టాలు, సమస్యలు, మార్కెట్ లో ఉన్న ధరల వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ...  గతంలో ప్రజా భవన్ లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో తర్వాత బనకచర్ల ప్రాజెక్టు చేపడుతామని చంద్రబాబు ప్రకటించారని, చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాత... ఆయన ప్రకటన చేశారని చెప్పారు. గోదావరి నది నుంచి 200 టీఎంసీలను కృష్ణా, పెన్నా బేసిన్ లకు తరలించడానికి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు చేపడుతోందని, మన దగ్గరి నుంచి 200 టీఎంసీల నీటిని ఏపీ ఎత్తుకపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తూ నిలబడ్డారని మండిపడ్డారు. నిజంగా తెలంగాణహితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని, ప్రభుత్వం కోర్టుల్లో ఎందుకు కేసులు వేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆనాడు ఏపీ ప్రాజెక్టులు చేపడితే, కాలువలు విస్తరిస్తే కేసీఆర్ వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారని, కోర్టుల్లో కేసులు వేసి స్టే లు తీసుకొచ్చారని గుర్తు చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, అవసరమైతే కోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని డిమాండ్ చేశారు. నోరుందికదా అని సీఎం రేవంత్ రెడ్డి గంప గయ్యాళిలా ఒర్రుతున్నారని విరుచుకుపడ్డారు.

కాగా, పేరుకే గెజిట్ జారీ చేసి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని, కానీ చట్టబద్ధత కల్పించలేదని ఎండగట్టారు. దాంతో దాంతో పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందని, బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయటి దేశాల నుంచి వచ్చే నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయని, దాని వల్ల స్థానికంగా పసుపుకు మంచి రేటు వస్తుందని వివరించారు.  

మార్కెట్ యార్డులో వ్యాపారులంతా సిండికేట్ గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారని, నాలుగైదు రోజులు వేచిచూసినా పసుపు కొనడం లేదని తెలిపారు. ఒక రకంగా రైతును బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నదని, ఎంత మంచి నాణ్యతగల పసుపుకు అయినా మంచి ధర ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

 పసుపుకు 12 వేల కనీస ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని,  అంతకు తక్కువ ధర ఉంటే మిగితా డబ్బును బోనస్ రూపంలో ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు  కేవలం రూ. 8000 వేలకు మాత్రమే పసుపును కొనుగోలు చేస్తున్నారని, అయినా కూడా ప్రభుత్వం బోనస్ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.తక్షణమే పసుపుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పసుపు బోర్డుకు చట్టబద్ధతు, కనీస మద్ధతు ధర కోసం కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. ధీన స్థితిలో ఉన్న పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. వ్యాపారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ధ్వజమెత్తారు. మార్చి 1లోపు బోనస్ ప్రకటించకపోతే జిల్లా కలెక్టరేట్ ను దిగ్భందిస్తామని హెచ్చరించారు.
 
మరోవైపు, తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవితగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసి సీఎం రేవంత్ రెడ్డి తీరు మారలేదని, తనపై మాట్లాడవద్దని సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారని తెలిపారు.

సుప్రీం కోర్టు తిట్టిన మొట్టమొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ కర్మ అని అన్నారు. తాను ఆయనలా మాట్లాడి తన స్థాయిని తగ్గించదలుచుకోవడం లేదని స్పష్టం చేశారు. నోరుందికదా అని ఎటుపడితే అటు మాట్లాడితే కుదరదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.

Tags

More News...

Local News 

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు   గొల్లపల్లి మే 09 (ప్రజా మంటలు): శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో సప్తమ బ్రహ్మోత్సవలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం  ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, నిత్య అభిషేకములు, దేవదాయ శాఖ సూచన ప్రకారం  "ఆపరేషన్ సిందూర్ "లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా . నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు  ఉదయం...
Read More...
Local News 

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు ఆపరేషన్ సిందూర్'లో ధైర్యంగా పోరాడుతున్న సైనికులకు అభినందనలు గొల్లపల్లి మే 09 (ప్రజా మంటలు):  ఆపరేషన్ సిందూర్'లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్, ఎంపీవో సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేటలోని  శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో  శుక్రవారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా...
Read More...
Local News 

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా...
Read More...
Local News 

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్. 
Read More...
Local News 

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*   భీమదేవరపల్లి మే 9 (ప్రజామంటలు) : హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, ఉపాధ్యక్షులు చిట్కూరి అనిల్ రక్తదానము చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి సేవ...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి  శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం  మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి...
Read More...
Local News 

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు.. సికింద్రాబాద్, మే 08 (ప్రజామంటలు): పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ఆర్మీ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఆపరేషన్ తో...
Read More...
Local News 

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్  

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలోని 735 సర్వే ప్రభుత్వ భూమిని కొంత భూమిని క్రీడా మైదానానికి ( మినీ స్టేడియం) కేటాయించాలని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ విప్ ను  మండలానికి చెందిన క్రీడాకారులు కోరగా,గురువారము ఆర్డీవో మదు సుదన్, తాసిల్దార్ వరందన్, ఆర్ఐ అనూష,సర్వేయర్ మోకా పైకి వచ్చి...
Read More...
Local News 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  ఉగ్రమూకల ఉన్మాదచర్య తో  ఊపిరి విడిచిన ముద్దుబిడ్డల *"గని" *  అంతులేని వేదన తో  ఉలుకుపలుకు లేక నిస్తేజంగా నిలిచిన పెహల్గాం పుడమితల్లి....   తీరని దుఃఖం తో ఎరుపెక్కిన కళ్లతో సమైక్య బలం చాటిన భారతీయుల భావోద్వేగాలుముష్కరుల పాలిట యమపాశాలు కాగా ఉగ్రవాద...
Read More...
Local News 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్                                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 ( ప్రజా మంటలు)    అధిక శబ్దం కలిగించే 130  ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ద్వంసం     రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించి జిల్లా పోలీసులకు సహకరించండి    శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను గత...
Read More...
Local News 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని రామ్ బజార్ లో గల వాసవి మాత ఆలయంలో వాసవి మాత జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, ఉత్సవమూర్తికి పల్లకి సేవ, ఫల పంచామృత అభిషేకం, వసంత రుతువులో లభ్యమయ్యే, ఆమ్ర, పలరసాభిషేకం నిర్వహించారు. మాతలు విశేష సంఖ్యలో  సామూహిక...
Read More...
Local News 

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం జగిత్యాల మే 7, ప్రజా మంటలు  విశ్వహిందూ పరిషత్  ఆధ్వర్యంలో జగిత్యాల నగర సేవా ప్రముఖ ఎలగందుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ కుట్టుమిషన్ శిక్షణ కేంద్రంలో మహిళలు మూడు నెలలు ట్రైనింగ్ పొందుతారు.ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వబడుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు...
Read More...