కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు - జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత
ఎల్కతుర్తిలో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలి
తెలంగాణ ఇస్తాని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్... ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తోంది
జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్పొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాల ఎప్రిల్ 16:
బిఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం జగిత్యాలలో జిల్లా అధ్యక్షులు. విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది.
ఇందులో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గుడిసెల రాజేశం గౌడ్, మాజీ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ దావా వసంత, నాయకులు ఓరుగంటి రమణారావు,మానాల కిషన్, లోక బాపురెడ్డి,కౌన్సిలర్ దేవేందర్ నాయక్,వివిధ సంఘాల, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
రజతోత్సవం గుజాబీ పండగ మాత్రమే కాదు... ఇది తెలంగాణ పండగ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటడానికి కేసీఆర్ పార్టీ పెట్టారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, ఈ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
ఇంకా కల్వకుంట్ల కవిత తన ప్రసంగలో ఇలా అన్నారు.బీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు తెలంగాణ యాస మాట్లాడే పరిస్థితి లేకుండే. 2001 నుంచి ఎన్నో అవమానాలు, కష్టాలను భరించి నిలబడింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది
తెలంగాణ ఏర్పాటు చేస్తామని 2004లో హామీ ఇచ్చిన కాంగ్రెస్... అరిగోస పెట్టింది.కేసీఆర్ దీక్ష చేయడంతో దిగొచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును ప్రకటించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎంపీ అర్వింద్ కలిసిమెలసి ఢిల్లీతో తిరుగుతున్న వార్తను టీవీల్లో చూశాను.సంజయ్ బీజేపీలో చేరారా లేదా కాంగ్రెస్ లో చేరారా అన్న అనుమానం వచ్చింది. సంజయ్ ఒక సారి సీఎం రేవంత్ రెడ్డితో... మరొక సారి బీజేపీ వాళ్లతో కనిపిస్తారు.
ఈసమావేశంలో ఎమ్మెల్సీ కవిత .ఆటలాడుతూ,ఉచిత బస్సు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నదని, ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని,ఉచిత బస్సు ఇచ్చాం కానీ బంగారం మాత్రం ఇవ్వమని రేవంత్ రెడ్డి అంటున్నారని విమర్శించారు.
ఇంకా, కళ్యాణ లక్ష్మీ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు ఒక బస్సు ఇచ్చి బంగారాన్ని తుస్సు చేశారు.. రుణ మాఫీ, రైతు భరోసా 50 శాతం మందికి ఇంకా రానేలేదు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలni కోరారు.
బీజేపీ మోసపూరిత విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పసుపు బోర్డును తూతూమంత్రంగా ఏర్పాటు చేశారు కానీ చట్టబద్ధత కల్పించలేదు. దాంతో పసుపు బోర్డుకు బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి డబ్బులు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. కానీ, మరి పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా? రెండు కోట్ల ఉద్యోగాలు, బోర్డుకు చట్టబద్ధత, మనిషికి 15 లక్షలు ఏమయ్యాయని అడిగితే ఎంపీ అర్వింద్ పిచ్చి మాటలు మాట్లాడుతారు.అంతకు మించి ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడిన దాఖలాలు లేవni విమర్శించారు.
రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.. అయినా కేంద్రం బడ్జెట్ లో తెలంగాణ 8 రూపాయలు కూడా ఇవ్వలేదు. 8+8 = పెద్ద గుండు సున్నా ఇచ్చారు.తెలంగాణను కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, గులాబీ జెండానే. ఇతర పార్టీలు చెప్పే మాయమాటల గురించి ప్రజలకు చెప్పాలి. ప్రతీ గ్రామ కమిటీలో ప్రతీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కవిత కోరారు.
ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొంది. జగిత్యాలకు నిధులు తీసుకురావడంతో ఎమ్మెల్యే సంజయ్ విఫలం. ఎమ్మెల్యే సంజయ్ ని గ్రామ గ్రామానా నిలదీయాలనీ కార్యకర్తలను కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
