కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ చేతులమీదుగా నగదు పురస్కారాలు అందజేత.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 22 ( ప్రజా మంటలు) :
శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల క్రీడా & సాంస్కృతిక దినోత్సవమును పురస్కరించుకుని కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ప్రధాన గ్రూప్ లలో ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులకు సుమారు 2.50 లక్షల విలువ గల నగదు పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ. అశోక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్, కాసుగంటి కుటుంబం ప్రతినిధి వకీల్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్, ఇంటర్మీడియట్ జిల్లా విద్యా అధికారి నారాయణ, కళాశాల పూర్వ విద్యార్ధి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, జూనియర్ ప్రభత్వ కళాశాలల ప్రిన్సిపాల్ లు, ఎన్ సి సి కళాశాల అధికారి రాజు, అధ్యాపక బృందం, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కార్యక్రమంకు విచ్చేసిన జస్టిస్ పుల్ల కార్తీక్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, కాసుగంటి కుటుంబం ప్రతినిధి, వకీల్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ మాట్లాడుతూ.....
- ఈ కళాశాల పూర్వ విద్యార్ధిగా తాను ఈ కార్యక్రంలో పాల్గొనడం అదృష్టమన్నారు.
- ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయనీ, విద్యాభివృద్ధికి సహకరిస్తున్న కాసుగంటి కుటుంబానికి, నిర్వహిస్తున్న లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.
- అలాగే, ప్రతీ విద్యార్ధి కష్టపడి చదివితేనే వృద్ధిలోకి రాగలరన్నారు.
- అలాగే తాను ఈ స్థాయికి రాగలిగానంటే అది అద్యాపక బృందం కృషి అన్నారు.కాసుగంటి కుటుంబం అందిస్తున్న స్ఫూర్తితో తాను సైతం వచ్చే సంవత్సరం నుండి ఎస్ కె ఎన్ ఆర్ జూనియర్, డిగ్రీ కళాశాలల ఉత్తమ విద్యార్థులకు తన తల్లితండ్రుల పేరిట గోల్డ్ మెడల్ ప్రధానం చేస్తానని ప్రకటించారు.
అలాగే
కాసుగంటి కుటుంబం ప్రతినిధి, వకీల్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ....
- జగిత్యాల ప్రాంతంలో విద్యభివృద్ధికోసం పాటుపడడమే తమ కుటుంబం ప్రధాన ధ్యేయమన్నారు.
- కళాశాల అభివృద్ధికోసం తమ తాత గారైన కాసుగంటి నారాయణ రావు అందించిన సుమారు 32 ఎకరాల భూమి కాపాడడంతో పాటుగా అక్రమణకు గురికాకుండా కాపాడదంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం అందిస్తున్న సహకారం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
- కాసుగంటి కుటుంబం గత 8 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహం వారి ఉజ్వల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
- ప్రతీ విద్యార్థిలో చదువుతో పాటుగా, సామాజిక దృక్పథం అలవర్చుకోవాలని, ఈ పురస్కారాలకు సార్థకత తేవాలన్నారు.
- అలాగే,శ్రీ కాసుగంటి కుటుంబం అందించే నగదు పురస్కారాలను ఎస్ కె ఎన్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం వచ్చే సంవత్సరం నుండి అందిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులకు కాసుగంటి కుటుంబం అందజేసే నగదు పురస్కారాలలో ప్రతి విద్యార్థికి రూ. 40 వేల రూ. ల నగదు పురస్కారంతో పాటుగా మరో నలుగురు విద్యార్థులకు సైతం నగదు పురస్కారంలను హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్, కాసుగంటి కుటుంబం ప్రతినిధి, వకీల్ సాబ్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)