భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు
తింపు నగర బౌద్ధ ఆలయంలో మెరిసిన ధనశ్రీ నాట్య ప్రదర్శన
మండల వ్యాప్తంగా అభినందనల వెల్లువ
భీమదేవరపల్లి మే 23 (ప్రజామంటలు) :
భరతనాట్య క్షేత్రంలో మరొకసారి తెలంగాణ ప్రతిభ తళుక్కుమంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన రామారపు సంధ్యారాణి, రాజు దంపతుల కుమార్తె ధనశ్రీ భూటాన్ రాజధాని తింపు నగరంలోని ప్రముఖ బౌద్ధ ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో తన కూచిపూడి నాట్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. హనుమకొండ మయూరి నాట్య కళాక్షేత్రం గురువు కుండే అరుణ రాజ్ కుమార్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన ధనశ్రీ ఇప్పటికే భారతదేశంలోని అనేక ప్రసిద్ధ దేవస్థానాలలో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అనేక అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూటాన్ బౌద్ధ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రదర్శనకు మెచ్చిన ఆలయ ప్రధాన అర్చకులు "బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు" ను అందజేశారు. ఈ సందర్భంగా గురువు అరుణ రాజ్ కుమార్ మాట్లాడుతూ, "ధనశ్రీ ప్రతిభ మరిన్ని అంతర్జాతీయ వేదికలపై వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాను," అని పేర్కొన్నారు. ఈ వార్త ముల్కనూర్ గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలను కలిగిస్తోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో కలకలం - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం

జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి

క్షయ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

జగిత్యాల పురపాలక కార్యాలయములో రాజీవ్ యువ వికాసం పదకం వారికి ఇంటర్వ్యూలు

అకాల వర్షాలకు మొలకెత్తుతున్న ధాన్యం. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన - దావ వసంత సురేష్

పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్న బ్యాంకు వినియోగదారులు_* ట్రాఫిక్ పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలని వినియోగదారుల ఆకాంక్ష

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు అర్ధరాత్రి ఆకస్మికంగా భద్రత పై ఎస్పీ సమీక్ష

భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి
