భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు
తింపు నగర బౌద్ధ ఆలయంలో మెరిసిన ధనశ్రీ నాట్య ప్రదర్శన
మండల వ్యాప్తంగా అభినందనల వెల్లువ
భీమదేవరపల్లి మే 23 (ప్రజామంటలు) :
భరతనాట్య క్షేత్రంలో మరొకసారి తెలంగాణ ప్రతిభ తళుక్కుమంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన రామారపు సంధ్యారాణి, రాజు దంపతుల కుమార్తె ధనశ్రీ భూటాన్ రాజధాని తింపు నగరంలోని ప్రముఖ బౌద్ధ ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో తన కూచిపూడి నాట్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. హనుమకొండ మయూరి నాట్య కళాక్షేత్రం గురువు కుండే అరుణ రాజ్ కుమార్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన ధనశ్రీ ఇప్పటికే భారతదేశంలోని అనేక ప్రసిద్ధ దేవస్థానాలలో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అనేక అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూటాన్ బౌద్ధ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రదర్శనకు మెచ్చిన ఆలయ ప్రధాన అర్చకులు "బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు" ను అందజేశారు. ఈ సందర్భంగా గురువు అరుణ రాజ్ కుమార్ మాట్లాడుతూ, "ధనశ్రీ ప్రతిభ మరిన్ని అంతర్జాతీయ వేదికలపై వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాను," అని పేర్కొన్నారు. ఈ వార్త ముల్కనూర్ గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలను కలిగిస్తోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
