జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.
బిల్డింగు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షల డిమాండ్
ఆఫీసు, ఇంటిపై ఏక కాలంలో దాడులు.. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు...
సికింద్రాబాద్ మే23 (ప్రజామంటలు):
జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో నిర్మిస్తున్న రెండు భవనాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఆయన కార్యాలయం, ఇంటిపై ఒక కాలంలో దాడులు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్సీ శ్రీధర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన వెంకట్ రావు అనే వ్యక్తి జీహెచ్ఎంసీ అనుమతి పొంది రెండు బిల్డింగుల నిర్మాణం చేశాడు. అయితే ఈ బిల్డింగులకు ఎన్ఓసీ కోసం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ రావు కు దరఖాస్తు పెట్టకున్నాడు. దీనిపై విఠల్ రావు ఈ రెండు భవనాలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి బిల్డింగు నిర్మాణంలో చిన్న చిన్న డీవియేషన్లు ఉన్నాయి... వాటిని సరిచేసుకుని వస్తే ఎన్ఓసీ ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఒక్కో బిల్డింగుకు రూ.4లక్షల చొప్పున రూ.8లక్షలు ఇస్తే ఎన్ఓసీ ఇస్తానని చెప్పాడు. దీంతో అంత డబ్బు తాను ఇచ్చుకోలేనని, రూ.4 లక్షలు ఇస్తానని వెంకట్ రావు చెప్పాడు.
అదేమీ కుదరదు రూ.8లక్షలు ఇవ్వాల్సిందే లేకుంటే ఎన్ఓసీ ఇవ్వడం కుదరదని విఠల్ రావు తేగేసి చెప్పాడు. దీంతో వెంకట్రావు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు. మల్కాజిగిరి సఫిల్ గూడ చెరువు వద్దకు ప్రభుత్వ వాహనంలో వచ్చిన విఠల్ రావు అందులోనే కూర్చుని రూ.4లక్షలు తీసుకున్నాడు. తరువాత ఎన్ఓసీ ఇవ్వకుండా తిప్పుకోవడం మొదలు పెట్టాడు. మిగిలిన రూ.4 లక్షల కోసం వెంకటరావు పై ఒత్తిడి తీసుకువచ్చాడు.అయితే మిగతా డబ్బులు ఇవ్వకపోవడంతో వెంకటరావు భవన నిర్మాణ అనుమతుల ఎన్ఓసీ ఫైళ్లను తిరస్కరించాడు. దీంతో వెంకట్ రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అసిస్టెంట్ ప్లానర్ విఠల్ రావును అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో విఠల్ రావు చాంబర్ లో సోదాలు నిర్వహించారు. మేడిపల్లిలోని ఆయన నివాసంతో పాటు కోఠి సుల్తాన్ బజారులో విఠల్ రావు ప్రైవేట్ కార్యాలయం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఈ మూడు ప్రాంతాలల్లో సోదాలు చేపట్టారు.రెండు భవన నిర్మాణాల అనుమతుల కోసం రూ. 8 లక్షలు డిమాండ్ చేసి రూ.4క్షలు తీసుకున్నట్లు నిర్దారణ అయిందని ఏసీబీ డీఎస్సీ శ్రీధర్ తెలిపారు. విఠల్ రావు సంపాదనకు మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. విఠల్ రావు సంపాదించిన అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి..? వాటి విలువ ఎంత .? తదితర విషయాలను త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు లంచం అడిగితే తమను సంప్రదించాలని ఆయన సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
