తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ రెండవ విలన్ బి ఆర్ ఎస్.
బిజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి
సికింద్రాబాద్ ఏప్రిల్ 29 (ప్రజా మంటలు):
2001లో ఏర్పడిన టీఆరెఎస్ పార్టీ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారాన్ని పంచుకొని తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మొదటి విలన్ అయితే టిఆర్ఎస్ పార్టీ రెండవ విలన్ అని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ...1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట నెహ్రూ తెలంగాణాను బలవంతంగా ఆంధ్రలో కలిపారని అన్నారు. ఆ తర్వాత తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి 1969వ సంవత్సరంలో తెలంగాణా తొలి దశ ఉద్యమం ప్రారంభమైందని ఆ ఉద్యమంలో 400 మంది తెలంగాణ వాదులను బలి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 2009 డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన తర్వాత ఆంధ్ర పెత్తందార్ల ఒత్తిడికి తలొగ్గి 23 డిసెంబర్ 2009 నాడు తెలంగాణ ప్రకటనను వాపస్ తీసుకుంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని అన్నారు. ఆతర్వాత కేసీఆర్ మహాకూటమి పేరుతో తెలంగాణ వ్యతిరేక పార్టీలు అయినా కాంగ్రెస్,టిడిపి, కమ్యూనిస్టులతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరింత ఆలస్యం అయిందని అన్నారు. దానికి ప్రతిఫలంగా 1200 మంది విద్యార్థులు నిరుద్యోగులను బలి తీసుకున్న పార్టీలు కాంగ్రెస్,టిఆర్ఎస్ అని అన్నారు. 2014 కంటే ముందు పార్లమెంటులో బిజెపి ప్రతిపక్ష నేత స్వర్గీయ సుష్మా స్వరాజ్ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు తెలంగాణ ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం అయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని పరస్పర విమర్శలు చేసుకుంటున్నా కాంగ్రెస్ బి ఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన వారే కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రులుగా కొనసాగుతూ గత ప్రభుత్వ వైఫల్యం వల్లే అప్పుల పాలు అయిందని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. బిఆరెస్ పార్టీ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం అని తొమ్మిదిన్నరేళ్లలో కేంద్రం నుండి 10లక్షల కోట్ల నిధులు ఇచ్చామని వీటికి సంబందించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూడు గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కెసిఆర్ ఎందుకు స్పందించలేదని అన్నారు. కాంగ్రెస్, బిఆరెస్ రెండు ఒక్కటేనని మొన్న జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రుజువుయిందని ఎద్దేవాచేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
