దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి
సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ
(రామ కిష్టయ్య సంగన భట్ల)
యూఏఈ దేశంలోని దుబాయిలో జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో ట్రావెల్ బ్యాన్ కు గురై జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు మధుకర్ (27) అనే యువకుడి ఖాతా ద్వారా ఎవరో లావాదేవీలు జరిపినందున అజ్మాన్ లోని కోర్టు అతనిపై ప్రయాణ నిషేధం (ట్రావెల్ బ్యాన్) విధించింది.
మధుకర్ తల్లిదండ్రులు మల్లవ్వ, అంజయ్యలు మంగళవారం హైదరాబాద్, బేగంపేట ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట ఒక వినతి పత్రం సమర్పించారు. ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచన మేరకు ప్రజాభవన్ కు చేరుకున్న వారికి ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి సహకరించారు. సీఎంఓ ద్వారా ప్రత్యేక శ్రద్ధతో సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని ప్రజావాణి ఇంచార్జి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు.
గల్ఫ్ దేశంలో జైలు పాలయిన మధుకర్ కు కాన్సులర్ (దౌత్య) సహాయంతో పాటు న్యాయవాదిని సమకూర్చి ఉచిత న్యాయ సహాయం అందించి ఇండియాకు వాపస్ తెప్పించాలని వారు అభ్యర్తించారు. న్యూ ఢిల్లీ లోని భారత విదేశాంగ శాఖతో, దుబాయి లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి తన కుమారుడిని ఆదుకోవాలని వారు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. వినతి పత్రం ప్రతిని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (న్యాయ సేవాధికార సంస్థ) కు కూడా పంపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి
