సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక.
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 12 (ప్రజా మంటలు)
సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక అన్నారు. హనుమాన్ జన్మదినం సందర్భంగా ధరూర్ క్యాంప్ కోదండ రామాలయం వద్ద ఏర్పాటుచేసిన 34 ఫీట్ల ధర్మ ధ్వజాన్ని శ్రీ వేణుగోపాలాచార్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోకెల్లా అతి విశిష్టమైనది, సర్వప్రాణులను సమానత్వంతో చూసేది మన సనాతన ధర్మమని అన్నారు. సనాతన ధర్మం విశిష్టతను నేటి తరానికి అందించాలని సూచించారు. పట్టణంలో ఏర్పాటుచేసిన ధర్మ ధ్వజం వద్ద ప్రతి వారానికోసారి కులాల కతీతంగా హిందువులు సమావేశమై మన ధర్మం యొక్క విశిష్టతను తెలుసుకోవాలని సూచించారు. *ఆధ్యాత్మికవేత్త తిగుళ్ళ
విషుశర్మ *మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని, గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందన్నారు. కార్యక్రమంలో *మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ* హిందువులంతా ఐక్యంగా ఉన్నప్పుడే మన ధర్మం చిరకాలం నిలుస్తుందన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో సనాతన ధర్మాన్ని అణిచివేయాలని ఎంతోమంది కుట్రలు పన్నుతున్నారని వారికి కొన్ని రాజకీయ పక్షాలు ఓట్ల కోసం మద్దతు పలుకుతున్నాయన్నారు. సనాతన ధర్మ వ్యతిరేకులను, సెక్యులరిజం పేరుతో సనాతన ధర్మాన్ని కించపరిచే రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ప్రతి హిందువు ఏకమై సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. చొప్పరి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శ్రీలత, గుర్రం రాము, రాజ్ కుమార్,హరీష్ బిజెపి నాయకులు ఏసీఎస్ రాజు, సిపెళ్లి రవీందర్, మ్యాన మహేష్, లింగంపేట శ్రీనివాస్, గడ్డల లక్ష్మి, విశ్వహిందూ పరిషత్ నాయకులు పద్మాకర్, అరుణ్, సంతోష్, బ్రహ్మాండభేరి నరేష్, రాజన్న, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
