అంబేద్కర్ అంటే అందరివాడని అర్థం... - అన్ని వర్గాలకు హక్కులు కల్పించిన చరిత్ర ఆయనదే - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ)
మహాదేవపూర్ ఏప్రిల్ 12 (ప్రజా మంటలు)
బారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటేనే అందరివాడనే అర్థమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మహదేవ్‌పూర్ మండలం సూరారం గ్రామంలో మాజీ సర్పంచ్ నాగుల సుజాత–లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, భూపాలపల్లి మాజీ జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిణీ రాకేష్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కలిస్ట్‌లంటే కేవలం ఎస్సీలు కాదని, అన్ని వర్గాలకు చెందిన వారని ఆయన అన్నారు. ఆనాడు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ అని చెప్పిన తర్వాత కూడా ఆయనను ఒక్క సామాజికవర్గానికే అంటగట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణ, విద్యావిధానం, మహిళలు, విద్యార్ధులు, కార్మికులకు ఏ రకమైన హక్కులుండాలని చెప్పింది అంబేద్కర్ అని ఆయన వివరించారు. అలాగే ఎస్సీలు, బీసీలకు రిజర్వేషన్‌లు కావాలన్నది కూడా ఆయననేనన్నారు. అయితే ఎస్సీల రిజర్వేషన్‌ల కోసం పోరాటం చేసిండని అంబేద్కర్‌ను ఎస్సీలకే పరిమితం చేయాలని చూశారని, అనేక కుట్రల ఫలితమేనని ఆయన వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు బారత రాజ్యాంగాన్ని అన్ని బాషల్లో ఒక సబ్జెక్ట్‌గా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.అన్ని వర్గాల కోసం పోరాడిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన, ఆకాంక్ష ఉండటం గొప్ప విషయమన్నారు. ఏప్రిల్ మాసమంతా మహనీయుల మాసమని, ఈ మాసంలో ప్రతి మహనీయుడిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ప్రతి ఒక్కరు అంబేద్కర్‌ను అర్థం చేసుకోవాలి...పుట్ట మధూకర్, మాజీ ఎమ్మెల్యే మంథని
రాజ్యాంగం అందించమే కాకుండా ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బీఆర్‌ఎస్ అంబేద్కర్‌ను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని, ఆయన గురించి తెలుసుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మహాదేవ్‌పూర్ మండలం సూరారం గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహవిష్కరణలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈనాడు అంబేద్కర్ అంటే తెలియని వాళ్లు కేవలం ఎస్సీల కోసమే ఆలోచన చేసిండ్లని అనాలోచితంగా మాట్లాడుతున్నారని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
