ధర్మపురి స్వామి కల్యాణానికి ప్రభుత్వ పట్టు వస్త్రాలు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఏటా నిర్వహించే లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీవెంకటేశ్వర స్వామివారల కళ్యాణానికి పట్టు వస్త్రాలు అంద జేయడం జరుగుతున్నది. దక్షిణ కాశీగా, నవనారసింహ క్షేత్రాలలో ఉత్కృష్టమైనదిగా, హరిహర క్షేత్రంగా అనాదిగా భాసిల్లుతున్న ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన యోగ, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ, శ్రీవేంకటేశ్వర మువ్వు స్వాముల కళ్యాణోత్సవానికి ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాది కాను కల సమర్పణ దశాబ్దాల విజ్ఞప్తులకు గాను మాజీ రాష్ట్ర దేవాదాయ మంత్రి, బుగ్గారం చివరి ఎమ్యెల్యే జువ్వాడి రత్నాకర్ రావు కృషి ఫలితంగా చివరి క్షణంలో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడి, పట్టు వస్త్రాలను నాటి నుండి జిల్లా కలెక్టర్లు అందించడం జరుగు తున్నది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ (ఎండోమెంట్స్ 2) శాఖ ఉత్తర్వు సంఖ్య తేది 433/06.03.2009 ద్వారా సంబంధిత కార్య దర్శి వీర భద్రయ్య సంతకంతో వెలువడిన ఉత్తర్వుల ద్వారా పట్టు వస్త్రాల అందజేత జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించే మువ్వురు స్వాముల కళ్యాణాలకు ప్రభుత్వ పక్షాన పట్టు ధోవతులు, పంచెలు, అమ్మవార లకు పట్టు చీరలు, జాకెటు పీసులు జిల్లా కలెక్టర్ ద్వారా అంద జేస్తున్నారు.
ఈక్రమంలో మంగళ వారం దేవస్థానంలో జరుగనున్న మువ్వురు స్వాముల కల్యాణాలకు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్... ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
దేవస్థానం మాజీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వెన్నెల దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)