కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం      

On
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం      

                        సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 
జగిత్యాల ఏప్రిల్ 9(ప్రజా మంటలు)
ఈ నెల 11 నుండి 13  వ తేదీ వరకు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ బి. సత్య ప్రసాద్ 

బుధవారం మినీ  కాన్ఫరెన్స్ హాల్ లో  హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు, ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ,జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత తో కలిసి  జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11  నుండి జయంతి కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో 10వ తేదీలోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని, క్రింది స్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 3 రోజుల పాటు లైటింగ్, హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 11 వ తేదీ రాత్రి నుండి 13 వ తేదీ ఉదయం వరకు సుమారు రెండు లక్షలకు పైగా  భక్తులు వచ్చే అవకాశం ఉందని, సుమారు 45 వేల మంది మాల విరమణ చేస్తారని తెలిపారు.

ఈ 3 రోజుల పాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి  సుమారు 5 లక్షల ప్రసాదలను అందుబాటులో జరుగుతుందని  పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో 64 సి. సి. కెమెరాలు ఉండగా అదనంగా 50 సి. సి. కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 6 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. అలాగే 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు. ఇందుకోసం ఒక వేదికను ఏర్పాటు చేసి 100 మంది కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. అలాగే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కొండపైకి వెళ్లేందుకు ఆర్. టి. సి. బస్సులను పెంచాలని అధిక సంఖ్యలో భక్తులు  పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆదేశించారు. చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని,  కోనేరు వద్ద భక్తులు అధిక సంఖ్యలో స్నానం ఆచరించే వీలు ఉన్నందున ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేయించాలని మున్సిపల్ అధికారులను, భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ అధికారులను, 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని విద్యుత్ అధికారులను ఆయన ఆదేశించారు.

కేశఖండనకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా కళ్యాణ కట్ట వద్ద ఎక్కువ మంది నాయీబ్రాహ్మణులను ఏర్పాటు చేయాలని,  అధికారులకు సూచించారు. పబ్లిక్ టాయిలెట్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జయంతి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయుటకు షిఫ్ట్ ల వారీగా అధికారులు, సిబ్బంది సమన్వయం  చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్  సూచించారు. 

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, డి. ఎస్పీ., రఘు చందన్, కొండగట్టు ఆలయ ఈ. ఓ. శ్రీనివాస రావ్ , జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ , కలెక్టరేట్ ఏ. ఓ. హకీం, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్ స్పందన , ఎంపీడీఓలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

State News 

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స లండన్ లో జరిగిన ప్రమాదంలో కుడిచేయి ఫ్రాక్చర్..  *కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో సర్జరీ సికింద్రాబాద్ మే 06 (ప్రజామంటలు) : ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరికి బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రిలో వైద్యులు మంగళవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్రూమ్...
Read More...

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 05 మే (ప్రజా మంటలు) : అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తీసుకుంటున్న వ్యవస్థాగత పరమైన మార్పులలో బాగంగా ఎన్నో విలువైన, గుణాత్మక విషయాలకు పట్టం కడుతుంది అందులో భాగంగానే జిల్లా స్థాయిలలో గ్రంథాలయ చైర్మన్ పదవులకు పెద్ద మొత్తంలో బి.సి లకు అందునా చదువుకున్న...
Read More...
Local News 

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 6 (ప్రజా మంటలు)రోడ్డు ప్రమాదాల నివారణకై మంగళవారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నలభై వాహనాలను సీజ్ చేసినట్లు పట్టణ సీఐ ఎస్ వేణుగోపాల్ తెలిపారు. ఇటీవల కలెక్టర్ ఎస్పీతో రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారనీ తెలిపారు. జిల్లా...
Read More...
Local News  State News 

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్ హైదరాబాద్ ఏప్రిల్ 06: ‘ఆపరేషన్ అభ్యాస్’ అనే కోడ్ పేరుతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను 07-05-2025న 1600 గంటలకు ప్లాన్ చేయబడింది. భారత ప్రభుత్వం 244 జిల్లాలను దుర్బల జిల్లాలుగా గుర్తించింది, ఇందులో హైదరాబాద్ నగరం కూడా ఉంది.తెలంగాణలో, ORR పరిధిలోని హైదరాబాద్ నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించబడుతుంది. పౌర రక్షణ బాధ్యతలో భాగంగా,...
Read More...
Local News 

 అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

 అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్ జగిత్యాల ఏప్రిల్ 06: తల్లిదండ్రులు ఇద్దరు అనారోగ్యంతో చనిపోయారు వారి ముగ్గురు పిల్లలు అనాధలు అయినారు సమాచారం తెలుసుకుని జగిత్యాల సామాజిక సేవకులు సూరజ్ శివ శంకర్ పిల్లలకు ఆర్థిక సహాయం అందజేశారు. సిద్దిపేట జిల్లా తొక్కుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామానికి వెళ్లి మృతుల పిల్లలు దుఃఖంతో ఉన్నవారిని ఓదార్చి సూరజ్ శివశంకర్ పిల్లలకు 7000...
Read More...
Local News  State News 

కేసీఆర్ అప్పు..తెలంగాణ భ‌విష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

కేసీఆర్ అప్పు..తెలంగాణ భ‌విష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క... *గ‌త ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది... *సనత్ నగర్ లో లబ్దిదారుడి ఇంట్లో సన్నబియ్యం బువ్వ తిన్న మంత్రి సీతక్క.... సికింద్రాబాద్ మే 06 (ప్రజామంటలు) :    కేసీఆర్ ప్రభుత్వం చేసిన  అప్పు తెలంగాణ భ‌విష్యత్తుకు ముప్పుగా దాపురించిందని రాష్ట్ర మంత్రి సీతక్క అప్పులు,...
Read More...
Local News 

ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_

ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ బి సి సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల  జగిత్యాల మే 6(ప్రజా మంటలు)జాతీయ జనాభా గణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనందరి విజయానికి సంకేతం. ఈ నేపథ్యంలో కులగణనపై తగిన సూచనలు, సలహాలు, అభిప్రాయాలను కేంద్రానికి నివేదించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో అందరి...
Read More...
Local News 

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి చందయ్య పల్లిలో మిన్నంటిన రైతుల రోదనలు బాధిత రైతులను ఆదుకోవాలని ప్రజల విజ్ఞప్తి బుగ్గారం ఏప్రిల్ 06 (ప్రజా మంటలు):  జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయ్య పల్లిలో మంగళ వారం ఉదయం నాలుగు గేదెలు (బర్రెలు) విద్యుత్ షాక్ తో మృత్యు వాత పడ్డాయి.   గేదెలను మంగళ వారం ఉదయం మేత కోసంబియ్యాల...
Read More...
Local News 

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్ జిల్లాలో గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్న వారిపై పటిష్ట నిఘా: ఎస్పీ మహేష్ బి.గితే  సిరిసిల్ల ఏప్రిల్ 06: గంజాయి అక్రమ రవాణా కేసులో MD. హమ్మద్ అనే వ్యక్తిపై జిల్లాలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగళ్ళపల్లి, బోయినపల్లి, చందుర్తి పోలీస్ స్టేషన్ లలో 15 కేసులు నమోదు కాగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో...
Read More...
Local News 

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్     ▪️బీర్పూర్ మే 5(ప్రజా మంటలు)మండలంలోని కొల్వాయి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా 20 లక్షలతో నిర్మిస్తున్న పల్లె దావాఖానాను, 15 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన జగిత్యాల జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్   ▪️తాళ్ళ ధర్మారం గ్రామంలో 20లక్షలతో  పల్లె దవాఖానా నిర్మాణ పనులను...
Read More...
Local News 

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు                                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 5 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలోగత 10 రోజులుగా జరుగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు సోమవారం ముగిశాయి. విద్యార్థినీ విద్యార్థులచే భగవద్గీత శ్లోకాల పరీక్ష పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.                                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ         జగిత్యాల మే 6(ప్రజా మంటలు)    రాష్ట్రంలోని ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్షలు పాసైన విద్యార్ధిని, విద్యార్థులందరూ డిగ్రీలో ప్రవేశాల కొరకై దోస్త్ (డిగ్రీఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్లు ప్రారంభమ య్యాయి అని స్థానిక SKNR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా దోస్త్ అడ్మిషన్ల జగిత్యాల...
Read More...