బగ్గారం సాంభశివుని సన్నిధికి శివరాత్రి పూజలు
సాంబశివుని సన్నిధిలో కుంకుమ పూజలు - గీతా హవణ యజ్ఞం
బుగ్గారం/ జగిత్యాల జిల్లా ఫిబ్రవరి 25:
మహా శివరాత్రి జాతర ఉత్సవాలలో భాగంగా బుగ్గారంలోని సంతాన సాఫల్య శ్రీ సాంబ శివ నాగేశ్వర ఆలయంలో మంగళ వారం మాతలచే కుంకుమ పూజలు, జంటలచే గీతా హవణ యజ్ఞం లు నిర్వహించారు.
ఆలయ కమిటి చైర్మన్ మసర్థి రాజిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ శ్రీహరి మౌన స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పలువురు వేద పండితులు మాతలచే కుంకుమ పూజలు చేయించారు. లోక కళ్యాణం కోసం మాతలు అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవిని అష్టోత్తర శతనామావళితో అర్చన చేశారు. సామూహికంగా మంగళ హారతులు ఇచ్చి అమ్మవారికి అర్పించారు.
18 కుండలాలతో "గీతా హవణ యజ్ఞం
బుగ్గారంలోని శ్రీ సాంబశివ నాగేశ్వర ఆలయ ప్రాంగణంలో 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
మంగళ వారం 18 కుండలాలచే గీతా హవణ యజ్ఞం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా రోటిగూడెం లోని గీతా ధర్మ ప్రచార కేంద్రం నిర్వహకులు శ్రీశ్రీశ్రీ - శ్రీ హరి మౌన స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేద పండితులు, శ్రీ మద్భగవద్గీత సత్సంగ వెల్ఫేర్ సొసైటీ మంచిర్యాల బృందంచే గీతా పారాయణం చేశారు. పలువురు పండితులు, ఆధ్యాత్మిక ప్రముఖులు ప్రసంగిస్తూ భక్తి, పూజలు, యజ్ఞాలు, లోక కళ్యానార్థం చేసే యజ్ఞ - యాగాల గూర్చి, వాటి ఫలితాల గురించి వివరించారు.
బుగ్గారంలోని హమాలీ సంఘం ఆధ్వర్యంలో చేసిన శుచి - రుచి కరమైన వంటకాలతో అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో శివ దీక్షా స్వాములు, ఆలయ కమిటి చైర్మన్ మసర్థి రాజిరెడ్డి, ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, మాజీ సర్పంచ్ సుద్దాల శరత్ చందర్,
వేద పండితులు శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి, పడాల రామస్వామి, ముంజ నారాయణ గౌడ్, అగస్ట మహారాజ్, ప్రమోద్ శర్మ, కంచర్ల శివ శంకరాచారి, ఆలయ అర్చకులు సాత్పడి రంగయ్య, శ్రీ పేరంబూదూరు రామకృష్ణ స్వామి, శ్రీ మద్ భగవద్గీత సత్సంగ వెల్ఫేర్ సొసైటీ మంచిర్యాల బృందం గురువు దాసరి భక్త రాజేశం, వేముల రాజమౌళి, సీహెచ్ రాం బాబు, టి.మనోహర్, ఎస్.రాజన్న, టి. మదూకర్, వి.రమాదేవి, టి.హేమలత, జి.లక్ష్మీ, ఎ.వినోద, పి.విజయ లక్ష్మి, ఎస్.అనసూర్య, ఆలయ కమిటీ సభ్యులు కటుకూరి అంజయ్య, బొద్ధుల లక్ష్మణ్, పొలంపల్లి మల్లేశం, పెద్దనవేణి రాఘయ్య, తాడేపు లింగన్న, కొత్తపల్లి గంగాధర్, బిఆర్ఎస్ నాయకులు దసర్తి పూర్ణ చందర్, భారతపు రాజ శేఖర్, ఆకుల శేఖర్, గంగన్న, తదితరులతో పాటు భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)