లోన్లు ఇప్పిస్తానని రూ.3 కోట్లు వసూలు చేసిన ఘనుడు
లోన్లు ఇప్పిస్తానని రూ.3 కోట్లు వసూలు చేసిన ఘనుడు
బాధితుల చేతికి చిక్కిన వేణువర్మ
జగిత్యాల ఫిబ్రవరి 08:
జగిత్యాల జిల్లాలో ప్రధానమంత్రి యోజన పథకం పేరుతో భారీ మోసం బయటపడింది. ఓ కేటుగాడు లోన్లు ఇప్పిస్తామని కోట్లు కొల్లగొట్టాడు. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మంది నుంచి 2 కోట్ల 96 లక్షలు వసూలు చేశాడు. కేటుగాడు వేణువర్మ అనే వ్యక్తి.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ కు చెందిన కుడిచర్ల వేణువర్మ నాలుగేళ్లుగా ప్రధాన మంత్రి యోజన పథకం ద్వారా ఋణాలిప్పిస్తానని అందరినీ నమ్మించాడు. ఇది నమ్మిన అమాయక ప్రజలు డబ్బులు వస్తాయని బంగారం,నగదు అప్పజెప్పారు. అయితే ఎన్ని రోజులైనా లోన్ ఇవ్వకపోగా తప్పించుకు తిరుగుతున్నాడు.
దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వేణువర్మ కోసం వెతుకుతున్నారు. ఫిబ్రవరి 8న ఉదయం జగిత్యాల జిల్లా కేంద్రం తీన్ ఖాన్ చౌరస్తా దగ్గర వేణువర్మను పట్టుకున్న బాధితులు పోలీసులకు అప్పగించారు. అయితే సుమారు 30 కోట్లకు పైన వసూలు చేసినట్టు ఆరోపిస్తున్నారు బాధితులు
ఇది నిజంగా తీవ్రమైన మోసపు ఘటన. ప్రధానమంత్రి యోజన పథకం పేరుతో ప్రజలను మోసం చేసి కోట్లు వసూలు చేసిన వేణువర్మను బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇలాంటి మోసాలను నివారించేందుకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. లోన్లు లేదా ఇతర ఆర్థిక సేవలను పొందే ముందు అధికారికంగా ధృవీకరించుకోవాలి. ప్రభుత్వ పథకాల గురించి అధికారిక వెబ్‌సైట్లు లేదా సంబంధిత బ్యాంకులను సంప్రదించి స్పష్టత పొందాలి.
పోలీసులు ఈ కేసును సక్రమంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
