సిఎం సహాయ నిధికి 10వా తరగతి విద్యార్థిని విరాళం
On
సిఎం సహాయ నిధికి 10వా తరగతి విద్యార్థిని విరాళం
మహబూబాబాద్ సెప్టెంబర్ 03:
జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు వరద సహాయక కార్యక్రమాల కోసం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవడానికి తన కిట్టీ బ్యాంకులో పొదుపు చేసుకున్న3 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డిని కలిసి ఈ సహాయాన్ని అందజేయగా ముఖ్యమంత్రి గారు ఆ అమ్మాయిని అభినందించారు.
Tags