లోక్ సభ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లను పోలింగ్ కేంద్రం దిశగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూసే బాధ్యత అందరిది.

- జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.

On
లోక్ సభ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లను పోలింగ్ కేంద్రం దిశగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూసే బాధ్యత అందరిది.

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

 

జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు ) : 

మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అర్హతగల ప్రతి ఓటరును పోలింగ్ కేంద్రం దిశగా తీసుకువెళ్లి, ఓటు హక్కు వినియోగించుకునేలా చూసే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాఅన్నారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర, రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.రాంబాబు తో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికల వివరాలు వెల్లడించడంతో పాటుగా, జిల్లాలో ఓటింగ్ శాతం పెంచడానికిగాను చేపట్టిన ఒక వినూత్నంగా ' ఓట్ల పర్వం-ఓటే సర్వం' అనే నినాదంతో కూడిన కార్యక్రమంను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎన్నికల అధికారి, కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ...ఈ లోక్‌సభ ఎన్నికల్లో గతంలోకన్నా ఎక్కువ ఓటింగ్ శాతం పెంచడానికే ఈ కార్యక్రమం ఆవిష్కరించడం జరిగిందన్నారు.జిల్లా లోని మూడు నియోజకవర్గాలలో ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైన చోట సంబంధిత వ్యక్తులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.

అలాగే, జగిత్యాల జిల్లా లోని మూడు నియోజకవర్గాలు ఉండగా, 7,12,710 మంది ఓటర్లున్నారని వివరించారు.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో 4,81,924మంది ఓటర్లుండగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ లో 3,70,460 మంది ఓటర్లున్నారని వివరించారు. ఇంకా జిల్లా లొని 782 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని, సుమారు 990 సిసి కెమెరాలు ఏర్పాటు గావిస్తున్నామని వివరించారు.

అంతేగాకుండా, జిల్లాలో 36 థిమాటిక్ పోలింగ్ కెంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Tags