భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ
. సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 10 : (ప్రజా మంటలు)
జమ్మూ కాశ్మీర్ పహెల్గాం లో పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు 26 మంది అమాయకులను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన అనంతరం మన భారత వీర జవాన్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు చేస్తున్న వీరోచిత పోరాటానికి మద్దతుగా జగిత్యాల పాత్రికేయులు శనివారం సంఘీభావ ర్యాలీని నిర్వహించారు.
జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని జిల్లా కేంద్రంలోని తాహసిల్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మాతను కీర్తిస్తూ.. మన రక్షక దళాల వీరత్వాన్ని పొగడుతూ నినాదాలు చేశారు. అనంతరం పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా పక్కలో బల్లెం గా మారిన పాకిస్తాన్ భారతదేశ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఎన్నో మార్లు ప్రయత్నం చేసిందన్నారు.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ దేశంలో ఎంతోమంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుందన్నారు. శాంతికాముకులైన భారతదేశ ప్రజలు పాకిస్థాన్ కు స్నేహ హస్తాన్ని చాచినప్పటికీ పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మార్చుకోకుండా పదేపదే మన దేశం పైకి దాడులకు తెగబడడాన్ని తీవ్రంగా ఖండించారు.
రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి, మన వీర జవాన్లకు మద్దతు తెలపడం కనీస బాధ్యతగా గుర్తించి జగిత్యాల పాత్రికేయుల పక్షాన సంఘీభావ ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. దేశ ప్రజలందరూ కుల, మత, ప్రాంత విభేదాలు విడనాడి భారత ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు

వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు
