ధర్మపురిలో వైభవంగా శివరాత్రి వేడుకలు

On
ధర్మపురిలో వైభవంగా శివరాత్రి వేడుకలు

మిన్నంటిన భక్త్యావేశాలు
వివిధ ఆలయాలలో విప్ లక్ష్మణ్ కుమార్ పూజలు


(రామ కిష్టయ్య సంగన భట్ల
   9440595494)

దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, రాష్ట్రంలో మిగుల ప్రాచుర్యం పొందిన సనాతన సాంప్రదాయాల సిరియైన పవిత్ర గోదావరి నదీ తీరస్ధ తీర్థ మైన ధర్మ పురి 
 క్షేత్రంలో మహా శివ రాత్రి ఉత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. మున్నెన్నడూ లేని విధంగా, పర్వదిన సందర్భంగా బుధ
వారం సుదూర ప్రాంతాలనుండి ఏతెంచిన అశేష భక్తజన సందోహంతో, సనాతన క్షేత్రం అపర కైలాస పురియై అలరారింది. రాష్ట్రం లోని సుదూర ప్రాంతాలనుండి తరతరాల వారసత్వ ఆచరణలో భాగంగా, కైలాస నాథుని దర్శనార్ధం ప్రత్యేక ప్రయివేటు వాహనాలలో, మంగళ వారం రాత్రి నుండే క్షేత్రానికి చేరుకున్న భక్తులు, యాత్రికులు గురు వారం ఉదయాత్పూర్వం నుండి పవిత్ర గోదావరిలో మంగళ స్నానాలు ఆచరించారు. శ్రీరామలింగే శ్వర, అక్కపెల్లి రాజేశ్వర, మార్కండేయ, గౌతమేశ్వ రాలయాలలో మరియు శివ పంచాయతనాల ముందు దైవదర్శనార్ధం బారులుతీరి వేచి ఉండి భక్తి శ్రద్ధలతో అభయంకరుడు, అభిషేక ప్రియుడైన శంకరునికి ప్రత్యేక పూజలొనరించారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు స్థాపించిన రామలింగేశ్వరునికి ఉదయాత్పూర్వంనుండే మహన్యాస పూర్వక ఏకా దశ రుద్రాభిషేకం, సకృతావర్తన, సహస్ర నామార్చన, అష్టోత్తర, అన్న పూజాది ప్రత్యేక కార్యక్రమాలను  విధివిదానంగా నిర్వహించారు. దేవస్థానం ఎసి, ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, దేవస్థానం వేద పండితులు బొజ్జా రమేశ్ శర్మ, ముత్యాల శర్మ, ఆలయ అర్చకులు దేవళ్ళ విశ్వనాథశర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ, స్థానిక వేదపండితులచే శ్రీరామ లింగే శ్వరాలయంలో సామూహక రుద్రాభిషేకాలు, మంత్రపుష్ప నీరాజనాది అర్చనలు, విధివిధాన పూజలు గావించారు. అత్యధిక సంఖ్యలో ముత్తయి దువలు శివాలయంలో ప్రత్యేక చండి ప్రదక్షిణలు ఆచరించారు. మండలంలో పలు గ్రామాలలో ఉత్స వాలు నిర్వహించిన కారణంగా, తగిన సంఖ్యలో లేక, పోలీసుల సహకారం కొరవడి, ఒకదశలో రద్దీ క్రమబద్ధీకరణ దేవస్థానం సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. క్షేత్ర సమీపస్థ అక్కపెల్లి రాజేశ్వర స్వామి ఆలయంలో దేవస్థానంలో అర్చకులు ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, సీపతి సత్యనారాయణ నేతృత్వంలోని ఉత్సవ కమిటీ సభ్యుల
ఆధ్వర్యంలో వేద పండితులచే, ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వహించారు. పండితులు శివ మహాత్మ్యలను వివరించారు.   తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. స్థానిక పురపాలక సంఘం , కమిషనర్, మేనేజర్ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీటి, విద్యుత్ సౌక ర్యాలు ఏర్పాటు చేయగా, ఆర్యవైశ్య, వర్తక సంఘం అధ్యక్షులు మురికి శ్రీనివాస్, చౌడారపు సతీష్, జక్కు రవీందర్, రాజేందర్, శంకరయ్యల నేతృత్వంలో, మున్సిపల్ కార్యాలయ నంది విగ్రహ కూడలి నుండి, అలాగే కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్ పక్షాన అక్కపెల్లి 
రాజేశ్వరాలయానికి వాహనాలను ఉచితంగా ఏర్పాటు చేసి, ప్రయాణ సౌకర్యాలు కల్పించి, ప్రశంసాపాత్రులైనారు. గోదావరీ తీరస్థ మార్కండేయ మందిరాన పద్మశాలి సేవాసంఘం ఆధ్వర్యంలో బిల్వపత్ర, ప్రత్యేక పూజలొనరించారు. ఊహించని రద్దీ పెరిగి, దేవాలయ రోడు భక్తులతో నిండి, పోలీసుల కొరతతో రద్దీ క్రమబద్ధీకరణ కష్ట సాధ్యమైంది. ధర్మపురి పోలీస్ సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టారు. IMG-20250226-WA0489
అపర కైలాస పురియై అలరారిన ధర్మపురి

దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా, గంభీర గౌతమీ తటమున వెలసి, వరదాయిగా, భక్తి ముక్తి ప్రదాయినిగా, నిత్య భక్తజన సందడితో అలరారుతున్న ధర్మపురి క్షేత్రం, శివరాత్రి ఉత్సవ వేడుకల సందర్భంగా, అపర కైలాస పురియై అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండేగాక, రాష్టేతర సుదూర ప్రాంతాల నుండి సనాతన వారసత్వ ఆచారంలో భాగంగా దైవ దర్శ నాభిలాషులై ఏతెంచిన భక్తజన బృందగానాలు, భగ వన్నామ స్మరణలు, జయజయధ్వనాలు, మంగళవా ద్యాలు, విధివిధాన వేదోక్త పూజలు, భక్తి సంగీతాలు మమేకమై క్షేత్రంలో భక్తి పారవశ్యం అంబరాన్ని చుంబించింది. పిల్లాపాపలతో, నెత్తిన మూటాముల్లె లతో, పవిత్ర గోదావరి స్నానాలాచరించి, దర్శనాలు చేసుకుని, తమ మొక్కులు చెల్లించడానికి ఒక రోజు ముందు రాత్రినుండే ఏతెంచిన భక్తుల, యాత్రికులతో  ప్రాచీన క్షేత్రం అశేష జన సంద్రమైంది. సెలవు దినాన్ని పురస్కరించుకుని క్షేత్రానికి అరుదెంచిన భక్తుల వెల్లువ పుష్కరాల సమయాన్ని తలపించింది. ప్రధాన రహదారి నిండి పోయి రాక పోకలు స్థంభించిన వేళ, క్యూలైన్లను శివాలయం వైపుకు మళ్ళించే చర్యలు చేపట్టడం శక్తికి మించిన భారమైంది. రద్దీని క్రమబద్ధీకరించడంలో తీవ్ర వైఫల్యం నెలకొంది.

వివిధ ఆలయాలలో శివరాత్రి వేడుకలు

 ధర్మపురి క్షేత్రంలోగల పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న శ్రీరామ లింగేశ్వరాలయం, క్షేత్రస్థ మార్కండేయ మందిరం. శివారులోగల అక్కపెల్లి రాజేశ్వరాలయంలతోపాటు  మహా శివరాత్రి సందర్భంగా మండలం లోని వివిధ ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రామలింగేశ్వరాలయంలో, ఉదయం 6గంట లనుండి సాయంత్రం 6గంటల వరకు భక్తుల అభిషేకం, రాత్రి 10 గంటల వరకు మహా లింగార్చన, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాది పూజలు సాంప్ర దాయరీతిలో వేదపండితులచే నిశిపూజలు దేవ స్థానం ఎసి,ఈఓ శ్రీనివాస్, నేతృత్వంలో నిర్వహించారు. ధర్మపురి క్షేత్ర సమీపస్థ శ్రీఅక్కపెల్లి రాజేశ్వర దేవస్థానంలో, ఉత్సవ కమిటీ చైర్మన్ సత్యనారాయణ 
నేతృత్వంలో  వేదోక్త రీతిలో ఉదయం 9గంటలకు వేద పండితులు మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మద్యాహ్నం 12 గంటలకు మహామృత్యుంజయ జపం, సాయంత్రం 6గంటలకు శివకళ్యాణం, రాత్రి 9 గంటలకు భజనలు నిర్వహించారు. మార్కండేయ మందిరంలో క్షీరాభిషేకం, బిల్వపత్రాది ప్రత్యేక పూజలు పద్మశాలి సేవాసంఘం ఆధ్వర్యంలో జరిపారు. మండలంలోని నేరేళ్ళ గ్రామ సమీపాన దట్టమైన అటనీ క్షేత్రంలోగల సాంబశివుని దేవాలయంలో శివరాత్రి సందర్భంగా వేదవిదులు భక్తజన సమక్షంలో రుద్రాభిషేకం అనంతరం కల్యాణం జరిపించారు. ప్రత్యేక కార్యక్ర మాలు నిర్వహించారు. అలాగే నేరేళ్ళ గ్రామంలోని రాజరాజేశ్వరాలయంలో పూజలు గావించారు. జైనాలో  రుద్రాభిషేకాలు నిర్వహించారు.

వివిధ ఆలయాలలో విప్ లక్ష్మణ్ కుమార్ పూజలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, ధర్మపురి నియోజకవర్గంలోని పలు శివాలయాలను రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 
 సందర్శించారు. ధర్మపురి నియో జకవర్గంలోని పలు గ్రామాలలో శివాలయాలలో పూజలలో పాల్గొన్న అనంతరం ధర్మపురికి విచ్చేసి, ఆయన ప్రత్యేక పర్వదిన పూజోత్సవాలలో పాల్గొన్నారు. ఆర్చకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు సాంప్రదాయ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఘనంగా సత్కరించారు. అలాగే మాజీ మంత్రి ఈశ్వర్ కొప్పుల వివిధ ఆలయాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేవస్థానం పక్షాన పట్టువస్త్రాల సమర్పణ

ధర్మపురి క్షేత్రస్థ శ్రీరామలింగేశ్వరాలయంలో శివ రాత్రి సందర్భంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణానికి దేవస్థానం పక్షాన ఈఓ సంకటాల శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థానం ఇఓ శ్రీనివాస్,  సూపరింటెండెంట్ కిరణ్, అలువాల శ్రీనివాస్ సిబ్బంది మేళతాళాలతో వెళ్ళి, ఆర్చక పురోహితులు ప్రవీణ్, విశ్వనాథ శర్మలకు, అలాగే అక్కపెల్లి రాజేశ్వర ఆలయానికి    పట్టు వస్త్రాలు అంద జేశారు.

Tags

More News...

Local News 

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా...
Read More...
Local News 

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్. 
Read More...
Local News 

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*   భీమదేవరపల్లి మే 9 (ప్రజామంటలు) : హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, ఉపాధ్యక్షులు చిట్కూరి అనిల్ రక్తదానము చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి సేవ...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి  శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం  మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి...
Read More...
Local News 

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు.. సికింద్రాబాద్, మే 08 (ప్రజామంటలు): పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ఆర్మీ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఆపరేషన్ తో...
Read More...
Local News 

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్  

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలోని 735 సర్వే ప్రభుత్వ భూమిని కొంత భూమిని క్రీడా మైదానానికి ( మినీ స్టేడియం) కేటాయించాలని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ విప్ ను  మండలానికి చెందిన క్రీడాకారులు కోరగా,గురువారము ఆర్డీవో మదు సుదన్, తాసిల్దార్ వరందన్, ఆర్ఐ అనూష,సర్వేయర్ మోకా పైకి వచ్చి...
Read More...
Local News 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  ఉగ్రమూకల ఉన్మాదచర్య తో  ఊపిరి విడిచిన ముద్దుబిడ్డల *"గని" *  అంతులేని వేదన తో  ఉలుకుపలుకు లేక నిస్తేజంగా నిలిచిన పెహల్గాం పుడమితల్లి....   తీరని దుఃఖం తో ఎరుపెక్కిన కళ్లతో సమైక్య బలం చాటిన భారతీయుల భావోద్వేగాలుముష్కరుల పాలిట యమపాశాలు కాగా ఉగ్రవాద...
Read More...
Local News 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్                                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 ( ప్రజా మంటలు)    అధిక శబ్దం కలిగించే 130  ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ద్వంసం     రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించి జిల్లా పోలీసులకు సహకరించండి    శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను గత...
Read More...
Local News 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని రామ్ బజార్ లో గల వాసవి మాత ఆలయంలో వాసవి మాత జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, ఉత్సవమూర్తికి పల్లకి సేవ, ఫల పంచామృత అభిషేకం, వసంత రుతువులో లభ్యమయ్యే, ఆమ్ర, పలరసాభిషేకం నిర్వహించారు. మాతలు విశేష సంఖ్యలో  సామూహిక...
Read More...
Local News 

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం జగిత్యాల మే 7, ప్రజా మంటలు  విశ్వహిందూ పరిషత్  ఆధ్వర్యంలో జగిత్యాల నగర సేవా ప్రముఖ ఎలగందుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ కుట్టుమిషన్ శిక్షణ కేంద్రంలో మహిళలు మూడు నెలలు ట్రైనింగ్ పొందుతారు.ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వబడుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩 భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : వాసవి మాత జయంతి సందర్భంగా అంచురీస్ కన్వెన్షన్ హాల్లో ఆర్యవైశ్యులందరు, వాసవి మాతకు కుంకుమ పూజలు నిర్వహించారు. మన దేశం శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలని వాసవి మాతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అంచూరి వెంకట్రాజము, గౌరవ అధ్యక్షులు పెద్ది సూర్య ప్రకాశం, కార్యవర్గ సభ్యులు...
Read More...
Local News 

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు) : ఉగాండా కు చెందిన యువతి వ్యభిచారం చేస్తూ బోయిన్ పల్లి పోలీసులకు పట్టుబడింది. బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రాజు తెలిపిన వివరాలు...మబ్జి షరాన్(23)అనే యువతి ఉగాండా దేశంలోని కోకో మేర్ ప్రాంతం నుంచి గత ఏడాది ఫిబ్రవరి21న టూరిస్ట్ వీసాపై ముంబై కి వచ్చింది. అక్కడి నుంచి...
Read More...