చిరువ్యాపారుల పొట్ట కొట్టకండి
చిరువ్యాపారుల పొట్ట కొట్టకండి
* ట్రాఫిక్ పోలీసులకు స్ర్టీట్ వెండర్స్ మొర
సికింద్రాబాద్, ఫిబ్రవరి 21 ( ప్రజామంటలు) :
రోడ్డుమీద చిరు వ్యాపారాలను నిర్వహించుకుంటూ జీవితాలను సాగిస్తున్నాం... మా వ్యాపారాలను తీసేసి మా బతుకులను రోడ్డుపాలు చేయకండయ్యా...అంటూ స్ర్టీట్ వెండర్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులకు మొరపెట్టుకున్నారు. గత నాలుగు నెలలుగా తమ వ్యాపారాలను నిర్వహించుకోవడంలేదని శుక్రవారం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు శుక్రవారం వారి గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మెట్టుగూడ - తార్నాక మీల్స్ ఫుడ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింత రమేష్ మాట్లాడుతూ...గత 20 ఏండ్లుగా ఆలుగడ్డ బావి బస్టాప్ నుండి తార్నాక ఆఫీసర్స్ క్లబ్ వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని జీవనాన్ని సాగిస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారాల జీవనోపాధి, క్రమబద్ధీకరణ చట్టం 2014లోని చాప్టర్ 2 లోని 3(3)ప్రకారం ఏ చిరు వ్యాపారిని తొలగించరాదని చట్టం ఉందని ఆయన గుర్తు చేశారు. 2014 చట్టం ప్రకారం తమ ప్రాంతంలో సర్వే చేసి ప్రభుత్వం తమకు గుర్తింపు కార్డులు, స్కిల్ ట్రైనింగ్ , ఫుడ్ సేఫ్టీ అధికారుల ట్రైనింగ్ సర్టిఫికెట్లు అందజేశారని వారు పేర్కొన్నారు.
మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత మాట్లాడుతూ,రోడ్డు పక్కన చిరువ్యాపారులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టకూడదని, వారి జీవనోపాధిని దెబ్బతీస్తే వాళ్ళ కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)