ధనస్వామ్య రాజకీయాలను ఓడించండి _ఉద్యమ నాయకుడు అశోక్ కుమార్ ను గెలిపించండి!! - *టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వై.అశోక్ కుమార్*
*
జగిత్యాల ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు)
ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన కరీంనగర్ నియోజకవర్గ టిపిటిఎఫ్ టీచర్లఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ గెలుపు కోసం జగిత్యాల లో ఎస్ వి ఎల్ ఆర్ గార్డెన్ లో భారీసంఖ్యలో మధ్దతుదారులతో శుక్రవారము సమావేశం జరిగింది.
కరీంనగర్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ టిపిటిఎఫ్ అభ్యర్థి వై అశోక్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులందరికీ సమానమైన నాణ్యమైన శాస్త్రీయమైన విద్య అందేలా ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు పోరాడుతానని అన్నారు విద్యారంగానికి ప్రభుత్వం బడ్జెట్లో 20% నిధులు కేటాయించేలా ఉద్యమిస్తానన్నారు అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చట్టసభలలో ప్రశ్నించే గొంతుకగా ఉంటానన్నారు విద్యారంగంలో కాంట్రాక్టు వ్యవస్థ రద్దు కోసం కేజీబీవీ టీచర్ల రెగ్యులరైజేషన్ కోసం గురుకుల మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోకుండా విద్యారంగం ఉపాధ్యాయుల ఆజెండాగా పని చేస్తానని ఉపాధ్యాయులు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు.
టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ , ఎస్ సి ఎస్ టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండల వెంకట్ గార్లు మాట్లాడుతూ విద్యా వ్యాపారం చేస్తూ కార్పొరేట్ శక్తిగా ఎదిగినటువంటి వ్యాపారులను ఉపాధ్యాయులు తిరస్కరించి, ఉపాధ్యాయులకు,సామాన్య ప్రజానీకానికి అనుబంధంగా పనిచేస్తూ ఉద్యమాలలో కొనసాగుతున్న ఉద్యమకారుడైన వై అశోక్ కుమార్ ఉపాధ్యాయులు బీసీ ప్రతినిధిగా ఓటు వేసే గెలిపించాల్సినటువంటి సామాజిక అవసరాన్ని గుర్తించాలని కోరారు. గతంలో కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీలుగా గెలిచినవారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తొత్తులుగా మారి ఉపాధ్యాయులకు మోసం చేస్తున్నారన్నారు ఈ నియోజకవర్గంలో ఉన్న కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విద్య వ్యాపారులకు టికెట్లు ఇచ్చి డబ్బుతో ఓట్లు కొందామని వస్తున్నారని ఉపాధ్యాయులు వారికి ఈసారి బుద్ధి చెప్పాలన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో వై అశోక్ కుమార్ గెలుపు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యారంగానికి అనివార్యత అని తెలిపారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ విద్యారంగం మీద,ఉపాధ్యాయుల సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తులను చట్టసభలకు పంపాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు . నల్గొండ నియోజకవర్గంలో గత ఆరేండ్లుగా టీచర్ల, విద్యారంగ సమస్యల మీద పోరాడానని,నల్గొండలో మరొక మారు నేను గెలుస్తున్నానని నాకు తోడుగా గత 30 ఏళ్లుగా నిజాయితీగా నీతిగా ఉపాధ్యాయ విద్యారంగా సమస్యలపై పోరాడిన వై అశోక్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ధనస్వామ్య రాజకీయాలను ఓడించండి ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు అశోకును గెలిపించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
సీనియర్ ఉపాధ్యాయ నాయకులు సూద రాజేందర్, కిషన్ రావు,గుంటి ఎల్లయ్య సోదర సంఘాల బాధ్యులు అంబటి భూమేశ్వర్ శ్యాంసుందర్,రామిరెడ్డి,నరేందర్, శంకర్ బాబు,జి జగపతిరావు, రాష్ట్ర కార్యదర్శి బోగ రమేష్,ఆడిట్ కమిటీ కన్వీనర్ రఘుపతి యాదవ్ జగిత్యాల జిల్లా టిపిటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొక్కుల రామచంద్రం, ఎడ్ల గోవర్ధన్, జిల్లా నాయకులు గండి రాజయ్య,రాచమల్ల మహేష్, గొల్లపల్లి సత్యనారాయణ, పి శ్రీనివాస్ జె మనోహర్ వేముల సుధాకర్, డి అశోక్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)