25 మెడికల్ కాలేజీల ఫ్యాకల్టీకి గాంధీలో శిక్షణ
* మూడు రోజుల పాటు ట్రైనింగ్ క్యాంప్
సికింద్రాబాద్ ఫిబ్రవరి 20 (ప్రజామంటలు) :
వైద్య విద్య బోధనలో ఆధునిక పద్ధతులను అవలంబించాలని, అందుకోసం అధ్యాపకులు కూడా తగిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే ఇందిరా అన్నారు. గురువారం గాంధీ మెడికల్ కళాశాలలోని రీజినల్ ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డా.ఇందిరా, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారితో కలిసి ప్రారంభించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు తెలంగాణలోని 60 మెడికల్ కళాశాలలను మూడు రీజియన్ లుగా విభజించారని, గాంధీ మెడికల్ కళాశాల కూడా ఒక రీజనల్ కేంద్రంగా ఉన్నదని, తమ పరిధిలో ఉన్న 25 వైద్య కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో తాము ఈ శిక్షణ ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు కేవలం మార్కులు మాత్రమే ప్రామాణికం కాకుండా వారి కమ్యూనికేషన్స్ కూడా మెరుగుపరచడానికి నూతన బోధన పద్ధతులు ఎంత ఉపయోగపడతాయి అని ఆమె చెప్పారు. ఈ అంశంపై మూడు రోజులపాటు శిక్షణ కూడా అందిస్తున్నామని తెలిపారు.
1998 లో రూపొందించిన మెడికల్ ఎడ్యుకేషన్ పద్దతిని 20 ఏండ్ల తర్వాత 2018 లో ఎన్ఎమ్సీ మార్చి, ఎంబీబీఎస్ స్టూడెంట్లకు కొత్త విద్యావిధానాన్ని తీసుకువచ్చిందని కన్వీనర్ డాక్టర్ కిరణ్ కుమార్ మాదాల తెలిపారు. ఈ నేపద్యంలో ఆయా మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీకి కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో రీజనల్ సెంటర్ కన్వీనర్ డాక్టర్ కిరణ్ కుమార్ మాదాల, కో కన్వీనర్ డాక్టర్ సుబోద్ కుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే.రవి శేఖర రావు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం
