పోలీసుల అదుపులో పలువురు గంజాయి విక్రేతలు, విక్రయించిన , వినియోగించిన చట్టప్రకారం కఠిన చర్యలు డి ఎస్పీ రఘు చందర్
జగిత్యాల ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)
గంజాయి అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో ఐదుగురు గంజాయి విక్రేతలను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పి తెలిపారు. బుధవారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించి నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు. జగిత్యాల రూరల్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కండ్లపల్లి శివారులో గంజాయి కలిగి ఉన్న 1 మానుక కులదీప్ 21 (జగిత్యాల గాంధీ నగర్) 2 బొక్కనపల్లి పవన్ కుమార్ 20 జగిత్యాల రూరల్ మండలం (గుట్రాజుపల్లి) 3 మగ్గిడి రాకేష్ 21 జగిత్యాల టౌన్ కు చెందిన వీరిని పట్టుకొని వారి వద్ద నుండి 130 గ్రాముల నిషేధిత గంజాయి మూడు మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు .అదే విధంగా బుధవారం మధ్యాహ్నం రఘురాముల కోట శివారులో గంజాయి కలిగి ఉన్న జగిత్యాలకు చెందిన కోరేపు సాయి 22 ,జగిత్యాల మార్కండేయ నగర్ కు చెందిన ఆనుమల్ల లోకేష్ కుమార్ 25 లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్రేతలు ఉట్నూర్ లోని ఒక వ్యక్తి వద్ద నుండి గంజాయి కొనుక్కొని వారి జల్సాల డబ్బుల కోసం ఇక్కడ యువకులకు అమ్ముతున్నారని సమాచారం మేరకు వారి వద్ద నుండి 1211 గ్రాముల నిషేధిత గంజాయి రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీన పరుచుకున్నారన్నారు. సమాచారం తెలిసినవారు పోలీసులకు తెలపాలన్నారు. నిషేధిత గంజాయిని విక్రయించిన, వినియోగించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి నిందితులను పట్టుకున్న జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి ,రూరల్ ఎస్సై ఎన్. సధాకర్ కానిస్టేబుల్ ఎం. శ్రీనివాస్, ఉమర్, మోహన్, శ్రీనివాస్ లను డీఎస్పీ రఘు చందర్ అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)