ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి తులాభారం, పూలంగిసేవ,సహస్ర దీపాలంకరణ వేడుకలు.

On
ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి తులాభారం, పూలంగిసేవ,సహస్ర దీపాలంకరణ వేడుకలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) :

 

జగిత్యాల మే 23( ప్రజా మంటలు)

జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేణుగోపాలస్వామి కి పూలంగి సేవ, తులాభారం తో పాటు ఆలయ ఆవరణ అంతా సహస్ర దీపాలంకరణను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం సామూహిక నవగ్రహ ఆరాధన, హోమము, నిర్వహించారు వైదిక క్రతువులు యజ్ఞాచారి దెబ్బడ వంశీధరాచారి, జీయర్ స్వామి శిష్య బృందం నిర్వహించారు.

ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు ఆశీర్వచనము చేశారు. తులాభారం సందర్భంగా నంబి సత్యనారాయనా చారి తులాభారపద్యాలను పఠించారు.

నంబి వేణుగోపాల ఆచార్య బ్రహ్మోత్సవ వేడుకల లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల ప్రాశస్త్యాన్ని తెలియజేశారు.

Tags