ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్
జగిత్యాల మే 17( ప్రజా మంటలు)
అడిషనల్ కలెక్టర్ ఆయిల్ పామ్ సాగు పై మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఉద్యాన అధికారులతో, లోహియా కంపెనీ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఈ సంవత్సరం 3750 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రతి క్లస్టర్ ఏ ఈ ఓ 50 ఎకరాలకు ఆయిల్ పామ్ మొక్కల డి డి లు రైతుల వద్దనుండి తీసి ఒక వారం రోజుల్లోగా లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
డి ఏ ఓ మాట్లాడుతూ వరి సాగుకంటే తక్కువ నీటి అవసరం ఈ పంటకు ఉంటుంది మరియు కోతుల బెడద లేకుండా అధిక ఆదాయాన్నిస్తుంది. కావున ఎక్కువమంది రైతులను గుర్తించాలని సూచించారు.
డి హెచ్ ఎస్ ఓ మాట్లాడుతూ మొక్కల డి డి చెల్లించి డ్రిప్ డి డి తర్వాత చెల్లించినా ఈ వానాకాలంలో మొక్కలు ఇవ్వబడునని కావున ఆసక్తి గల రైతులందరితో తోటలు నాటించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలోఅడిషనల్ కలెక్టర్ , జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జి. శ్యామ్ ప్రసాద్, ఏడిఏ లు, లోహియా కంపెనీ మేనేజర్ విజయ్ భరత్, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు,లోహియా క్షేత్ర సిబ్బంది, డ్రిప్ సిబ్బంది పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ రిపోర్టర్ పులుగు కరుణాకర్ మృతి

జైత్రయాత్ర ఉద్యమ నేత పి. నారాయణకు నివాళి

ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

మౌలిక సదుపాయాల కల్పనకై మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు

హైపర్ టెన్షన్ డే అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే కోవిడ్ కేసులు నమోదు

భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం

ప్రతి ఒక్కరికీ "చుట్టంలా ఉండే చట్టం' భూ భారతి చట్టం*

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ
