అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు
ఈ వైద్య పరీక్షల రిపోర్టులు తప్పనిసరి:
సికింద్రాబాద్, ఏప్రిల్ 21 ( ప్రజామంటలు):
అమర్ నాథ్ యాత్రికులకు అవసరమైన మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సోమవారం మొదలైంది. గాంధీ మెయిన్ బిల్డింగ్ మొదటి అంతస్తులోని మెడికల్ రికార్డ్స్ విభాగం (ఎంఆర్డీ) లో ప్రభుత్వం నియమించిన నలుగురు వైద్య ప్రొఫెసర్ ల బృందం దరఖాస్తుదారుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షలు, ఎక్స్ రే రిపోర్ట్ లను పరిశీలించారు. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఫిట్ నెస్ సర్టిఫికెట్లను జారీ చేశారు.
సోమవారం సర్టిఫికెట్ ల కోసం వచ్చిన ప్రజలతో ఎం ఆర్ డి సెక్షన్ కిక్కిరిసిపోయింది. మెడికల్ సర్టిఫికెట్లు పూర్తిగా ఉచితమని, ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో సర్టిఫికెట్ ల జారీ చేయబడుతుందని అధికారులు తెలిపారు.
ఈ వైద్య పరీక్షల రిపోర్టులు తప్పనిసరి:
అమర్ నాథ్ యాత్ర కు వెళ్ళడానికి అవసరమైన మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కావాల్సిన వారు ఈ వైద్య పరీక్షలను ఖచ్చితంగా చేయించుకోవాలని అధికారులు తెలిపారు. కంప్లీట్ బ్లడ్ ప్రోఫిల్లింగ్ (సీబీపీ) ఆర్దరైటీ సెడిమెంటేషన్ రేట్ (ఈఎస్ఆర్), కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్(సీయూఈ), ఎలక్టోకార్డియా గ్రామ్ (ఈసీజీ),బ్లడ్ యూరియా,బిఫోర్ లంచ్, ఆప్టర్ లంచ్ షుగర్ పరీక్షలు (ఎఫ్బీఎస్/పీఎల్బీఎస్), బ్లడ్ గ్రూప్ ఆర్హెచ్ టైప్, సీరం క్రియేటిన్, చెస్ట్ ఎక్స్రే రిపోర్టులను మెడికల్ బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇక 50 ఏండ్ల వయస్సు పై బడిన వారు పై రిపోర్టులతో పాటు అదనంగా రెండు మోకాళ్ళు(బోత్ నీస్), ఎక్స్ రే లు జరపరచాల్సి ఉంటుంది.
వీటితో పాటు ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసిన దరఖాస్తు ఫారం, గాంధీలో ఇచ్చే అప్లికేషన్ ఫారాలను నింపి, ఒక ఫొటో జతచేసి ఇవ్వాలి. ఈ వైద్య పరీక్షలన్నీ బయట ల్యాబ్ లల్లో కూడ చేసుకోవచ్చు. సదరు రిపోర్టులను గాంధీలో ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే అమర్ నాథ్ సమీపంలోని చెకింగ్ పాయింట్ల వద్ద కేంద్ర భద్రత బలగాలు యాత్రకు అనుమతించరు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి
