బక్రీద్‌ను పురస్కరించుకుని అక్రమ రవాణా – లేగ దూడలు, వాహనం స్వాధీనం*
ముగ్గురు అరెస్ట్
భీమదేవరపల్లి, మే 16 ప్రజామంటలు:
మండలంలో శుక్రవారం రాంనగర్ తండా వద్ద అక్రమంగా తరలిస్తున్న మూడు లేగ దూడలను వంగర పోలీసులు పట్టుకున్నారు. జూన్ 7న జరగనున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని అధిక ధరలకు అమ్మేందుకు అక్రమంగా తరలిస్తున్న సమయంలో వంగర పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, వంగర ట్రైనీ ఎస్సై హేమలత నేతృత్వంలో కానిస్టేబుళ్లు రాజు, రమేష్ వంగర పోలీస్ స్టేషన్ పరిధిలో రొటీన్ పట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై ఒక బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో మూడు లేగ దూడలు కనిపించాయి. అరెస్ట్ చేసిన వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి: జాఫర్ (వయసు 35, జమ్మికుంట కరీంనగర్ జిల్లా), ఇబ్రహీం (వయసు 48, జమ్మికుంట), కనకం సదానందం (వయసు 48, జమ్మికుంట) వీరు పశువులను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి బక్రీద్ సందర్భంగా అధిక లాభం పొందే ఉద్దేశంతో ఇతర జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సాక్షులు భూక్య రవి, బడావత్ బాలు సమక్షంలో లేగ దూడలు మరియు బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పశుసంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. దూడలను ధర్మసాగర్ (ముప్పారం) గోశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
