ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు
(రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494)
ధర్మపురి క్షేత్రంలోని ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మూల విరాట్టు ఫోటోలు, వీడియోలు ఇటీవలి కాలంలో అడ్డూ అదుపూ లేకుండా సామాజిక మాధ్యమాల్లో నిత్యం దర్శనం ఇస్తున్నాయి. నిత్య నిజరూప దర్శనం
ఫోటోలు, వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తీవ్ర విమర్శలకు హేతువు అవుతున్నది.
పూర్వం ధర్మవర్మ మహారాజు ధర్మ దేవత భక్తుడై, ప్రజలను ధర్మ కార్యోన్ముఖులను చేయడానికి చేసిన తపస్సు ఫలితంగా "ధర్మపురి" నామాం కితయై, లక్ష్మీ నరసింహ స్వామి భక్తుల కోరిన కోర్కెలు తీర్చేందుకు ఇచ్చట వెలసి ఉన్నాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. భక్తులకు కుల ఇల దైవమైన లక్ష్మీ నరసింహుని ఫోటోలు ఒకప్పుడు లభించేవే కావు. దశాబ్దాల క్రితం బ్లాక్ అండ్ వైట్ పాత ఫోటోల విక్రయానికి లైసెన్స్ కలిగిన స్థానికుడు రాయంభట్ల సాంబయ్య వద్ద మాత్రమే ప్రధాన దైవ ఫోటోలు లభించేవి. భక్తాగ్రేసరుడు శేషప్ప విరచిత నరసింహ శతక పద్యాల పుస్తకాల పైన కూడా స్థానిక దైవం ఫోటో కాకుండా సాధారణ రూపంలో ఫోటో ఉండేది.
పుస్తకాలు, క్యాలెండర్ ల ముద్రణ విషయంలో స్వామి వారి ఫోటో వేసుకునేందుకు దేవస్తానం అధికారుల అనుమతి తీసుకునే విషయం అనివార్యం. అయినా దేవాదయ శాఖ కాని, దేవస్థానం కాని అంత సులభంగా ఫోటో చిత్రీకరణకు, ప్రచురణకు అనుమతి ఇచ్చేవి కావు.
ప్రస్తుతం ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి ఫోటోలు వీడియోలు ఫేస్ బుక్, యూ ట్యూబ్ లే కాక ఎన్నో చానళ్లు, వ్యకిగత పోస్టింగులలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాలలో, ఫ్లెగ్జీలలో ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో స్వామివారి నిత్య అలంకరణ ఫోటోలు వీడియోలు అంతటా అగుపిస్తున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల పూర్వ అనుమతులు ఉంటున్నాయో లేదో తెలియదు కాని షార్ట్ ఫిల్మ్స్, వీడియోలలో ఎక్కువగా చిత్రీకరించ బడుతున్నాయి.
ఆగమ శాస్త్రానుసారం స్వయంభూ మూర్తుల వీడియో, ఫొటో తీయకూడదని అనుభవజ్ఞులైన పండితులు చెపుతారు.
ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ... ఫోటోలు వీడియోలు తీయరాదని బోర్డులు కూడా ఉంచారు.
నిజరూపం వీడియో నిత్యం వచ్చే భక్తులు తీయడాన్ని గమనించిన దేవాదాయశాఖ ఉద్యోగులు సెల్ఫోన్ లు లాక్కున్న, తర్వాత తీసిన చిత్రాలను తొలగించి తిరిగి ఫోన్లు ఇచ్చిన సంఘటనలు సర్వసాధారణమే.
సింహాచలం తదితర దేవస్థానాలలో నిజరూప దర్శన ఫోటోలను ఫోటోల వీడియోల చిత్రీ కరణ చేసి, వైరల్ చేసిన సందర్భాలలో దేవస్థానం అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడాలు కూడా జరిగాయి.
ఇదిలా ఉంటే...ఇటీవల ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి అభిషేక ప్రత్యేక పూజలు ఆసాంతం స్టాండింగ్ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వీడియో చిత్రీకరణ చేయడం విమర్శలకు హేతువు అయింది. వేద పండితులు నిత్యం కూర్చునే స్వామి సన్నిధి మంటపంలో స్టాండులు పెట్టి మరీ గంటలకు పైగా ప్రత్యేకించి లక్ష్మీ నరసింహ మూర్తుల మూల విరాట్టుల నిజ రూపాలను చిత్రీకరించడం చర్చోప చర్చలకు తావు ఇచ్చింది. 500 రూపాయల ప్రత్యేక అభిషేక టిక్కెట్లు తీసుకున్న భక్తులు తాము లక్ష్మీ నరసింహుల దర్శనాలు సరిగా చేసుకునే అవకాశం నీరుగారి పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. స్వామి నిజ రూపాన్ని గంటల కొద్దీ వీడియో తీసేందుకు దేవాదాయ శాఖ అధికారుల పూర్వ అనుమతులు ఉన్నాయా లేదా అనేది స్పష్టంగా ఉపస్తితులైన విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు చెప్పలేక పోయినా, నిజ రూప ఫోటోలు వీడియోలు తీయడానికి అధికారులు అనుమతించ రాదని స్థానికులు ముక్త కంఠంతో చెపుతున్నారు. ఇకనైనా ఈ విషయంపై దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలను పాటింప చేసి, సాంప్రదాయాలను పరిరక్షించి, మూల విరాట్టు ఫోటోలు, వీడియోలు బంధింప పడకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని శ్రామికులు ముక్త కంఠంతో కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి
