ఉపాధ్యాయులంత చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుంది
జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)
పిల్లల జీవితాలను బాగు చేసే సువర్ణ అవకాశం మనకు లభించింది కావున ఉపాధ్యాయులంత
చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు.
జగిత్యాల పట్టణంలోని ఓల్డ్
హైస్కూల్ జడ్పీహెచ్ఎస్ బాలురు, జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన వేసవి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు వచ్చే విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.
శుక్రవారం జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్ జడ్పీహెచ్ఎస్ బాలురు, జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన వేసవి శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ, విద్యా శాఖలో ఒకే రోజు మార్పు సాధ్యం కాదని, నిర్విరామంగా ప్రయత్నం జరుగుతూ ఉండాలని అన్నారు.
టీచర్ వృత్తి లో మనం కొనసాగడానికి ఒకే కారణం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలు మాత్రమేనని, నిరుపేద రైతులు, కూలీలు, బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల జీవితాలను బాగు చేసే అవకాశం మనకు లభించిందని అన్నారు.
భారత దేశంలో యువతకు మంచి విద్య నైపుణ్యం అందించగలిగితే సూపర్ పవర్ గా ఎదుగుతామని అన్నారు. చదువుకునేందుకు సామర్థ్యం లేని పిల్లలు మన దగ్గర ఎవరూ లేరని, సమాజంలో మంచి పునాది ఉండాలంటే ఉపాధ్యాయులు కీలకమని అన్నారు.
జిల్లాలోని ఉపాధ్యాయులకు మే 13 నుంచి మే 31 వరకు కంటెంట్ ఎన్ రిచ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైఫ్ స్కిల్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ వంటి అంశాల పై గణిత , సోషల్ మండల రిసోర్స్ పర్సన్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఐఆర్పీ లకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయులంతా చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుందని, వేసవి శిక్షణలో నేర్చుకున్న అంశాలను బోధనలో ఉపాధ్యాయులు అమలు చేయాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
