గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం
అభా ఐడి తో రోగుల రికార్డులు డిజిటల్ నమోదుపై అధ్యయనం
స్కాన్ అండ్ షేర్ ద్వారా వేగవంతమైన ఓపి పై ఆరా...
సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు):
ఆయుష్మాన్ భారత్(అభా) డిజిటల్ మిషన్ వర్క్ షాప్ లో భాగంగా, 18 రాష్ట్రాల నుండి ఆయా రాష్ట్రల నోడల్ అధికారులు శుక్రవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు, రికార్డుల డిజిటల్ నిర్వహణ సౌకర్యాలు, నూతనంగా వేగవంతమైన ఓపీడీసేవలు , స్కాన్ అండ్ షేర్ విధానం, ల్యాబ్ లో డిజిటల్ సేవలు అందించే విషయాలను ఈసందర్బంగా గాంధీ హాస్పిటల్ నోడల్ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి వారికి వివరించారు. క్రాస్-లెర్నింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వారికి గాంధీ ఆసుపత్రిలో నందు అందుతున్న సేవలను గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజ కుమారి , సి యస్ ఆర్ యం ఓ డాక్టర్ శేషాద్రి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్యులు, నోడల్ అధికారులు వారి సందేహాలను నివృత్తి చేశారు. వారు మాట్లాడుతూ రోగుల రికార్డులు డిజిటల్ చేయడం ద్వారా వారి ఆరోగ్య వివరాలు వారి మొబైల్ నెంబర్ ద్వారా వారి అకౌంట్ లో ఉంటాయని దీని ద్వారా వివరాలు, ల్యాబ్ రిపోర్టులు జీవితాంతం అందుబాటులో ఉంటాయని తెలిపారు. 100శాతం డిజిటల్ చేయాలని ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. స్కాన్ అండ్ షేర్ ద్వారా త్వరగా ఓపి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జాతీయ స్థాయి మెడికల్ బృంద సభ్యులు డాక్టర్ పంకజ్ అరోరా, సౌరభ్ సింగ్, రితిక, బబిత, అబ్యుధయ్ తో పాటు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ కుమారి, సి యస్ ఆర్ యం ఓ డాక్టర్ శేషాద్రి, ఓపి ఆర్ యం ఓ డాక్టర్ రజని, నోడల్ ఆఫీసర్ ఫర్ అభా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఆర్. యం ఓ లు డాక్టర్ మీనాక్షి , డాక్టర్ నజీమ్, డాక్టర్ సుధీర్, డాక్టర్ యోగి, డాక్టర్ నవీన్, డాక్టర్ సరిత, యూసుఫ్, కిరణ్, జగదీష్, చిరంజీవి, సుప్రియ, నరేష్ , రాష్ట్ర బృందం దివ్య , డాక్టర్ విమల, సురేష్ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన నోడల్ అధికారులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
