చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

On
చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

 జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)

*ధాన్యం కొనుగోలు, రేషన్ కార్డుల జారీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్*

 యాసంగి సీజన్ లో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ  వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని ధాన్యం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే.రామ కృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ లతో కలిసి ధాన్యం కొనుగోలు పై    జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు. *ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.

 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
 రైతులు పండించిన ప్రతి గింజ మద్దతు ధర పై కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని,  మన దగ్గర రికార్డ్ స్థాయిలో 57 లక్షల ఎకరాలలో వరి పంట సాగు జరిగిందని, ప్రభుత్వం దాదాపు 17 వేల కోట్ల ఖర్చు చేస్తూ 70 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేస్తుందని , వీటికి అదనంగా సన్న రకం ధాన్యానికి క్వింటాల్ 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నామని అన్నారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేసిన 48 గంటల్లో రైతులకు ఖాతాలో డబ్బు జమ అవుతుందని అన్నారు.  భారీ స్థాయిలో కొనుగోలు జరుగుతున్నప్పటికీ మీడియా లో సరిగ్గా కవర్ కావడం లేదని అన్నారు. పత్రికలలో వచ్చే నెగటీవ్ వార్తల స్పందించాలని, తప్పుడు వార్తలను తీప్పికొట్టాలని సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించాలని అన్నారు. 

రాబోయే 15 రోజులలో కొనుగోలు కేంద్రాలకు  ధాన్యం రానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 


జనవరి 26, 2025 తరువాత మన రాష్ట్రంలో నూతనంగా 1,57, 467 రేషన్ కార్డులను పంపిణీ చేశామని, వీటి ద్వారా 16 లక్షల 67 వేల 936 మంది ప్రజలకు అదనంగా రేషన్ అందుతుందని మంత్రి తెలిపారు.  మీసేవ కేంద్రాలు, ప్రజా పాలన కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తి చేసి అర్హులకు రేషన్ కార్డులను జారీ చేయాలని మంత్రి తెలిపారు. 

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణా రావు మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని,  ప్రభుత్వా నిబంధనల ప్రకారం కలెక్టర్లు ప్రణాళిక బద్దంగా యాసంగి పంట కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెగ్యులర్ గా కలెక్టర్లు తనిఖీ చేయాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ మాట్లాడుతూ, 
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 7 లక్షల 70 వేల 477 మంది రైతుల నుంచి  49 .53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8 వేల 42 కోట్లు మద్దతు ధర కింద చెల్లించామని అన్నారు.

ప్రతి రోజు అదనపు కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను 
పర్యవేక్షిస్తున్నామని అన్నారు. మే నెలాఖరు నాటికి పకడ్బందిగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. వార్తా పత్రికలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు. 

ధాన్యం రవాణా కు వాహనాల ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, కలెక్టర్, ఆర్.టి.ఓ , పోలీస్ అధికారులు సమన్వయంతో ఖాళీగా ఉన్న లారీలను పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలుకు కేటాయించాలని అన్నారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం బస్తాల అన్ లోడింగ్ ఆలస్యం కాకుండా చూడాలని, హమాలీల కొరత ఉండకుండా జాగ్రత్త పడాలని అన్నారు. 

గత ఆరు నెలల కాలంలో రేషన్ తీసుకోకపోవడం, ఇతర రాష్ట్రాలకు చెందిన డూప్లికేట్ బెనిఫిషరీ, చనిపోయిన వారి పేర్లు ఉండటం వంటి వివిధ కారణాల వల్ల భారత ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 96 వేల 240 రేషన్ కార్డుల పరిధిలోని లక్షా 62 వేల 777 మందు లబ్ధిదారులు అనుమానాస్పదంగా ఉన్నారని, జిల్లాల వారీగా సంబంధిత జాబితా అందించామని, వీటిపై విచారణ చేసి వివరాలు సమర్పించాలని కలెక్టర్ లకు సూచించారు. 

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ, కోపరేటివ్ అధికారులు  పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు – 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –  అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం...
Read More...
Local News  State News 

జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం  – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు

జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం  – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి   పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర...
Read More...
Crime  State News 

జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి

జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు): జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు...
Read More...
Local News 

జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్      

జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్       జగిత్యాల మార్చి 5 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్ లో “చాంపియన్స్ చాలెంజ్” పేరిట స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రీడలు శారీరక దృఢమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి ఈ కార్యక్రమానికి ముఖ్య...
Read More...
National  Comment  State News 

సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన?

 సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన? న్యూఢిల్లీ  మార్చ్ 05: భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా (Union Territory) మార్చే ప్రతిపాదనపై రాజకీయ, వ్యూహాత్మక వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ సరిహద్దు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటన నిర్వహించడం ఈ చర్చలకు మరింత...
Read More...
Local News 

సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు

సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంలో, గత నెల 5వ తేదీన స్థాపించిన 21 అడుగుల ఎత్తైన సైకత  శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి,గార్లు  బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుము
Read More...
Local News 

మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత

మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత మల్యాల మార్చి 4 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా  పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్...
Read More...
State News 

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు....
Read More...
State News 

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్ హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు): హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల...
Read More...
Local News 

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత    జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు)  పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్  అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు  ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ . శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ...
Read More...
Local News 

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.    హోళీ సందర్భంగా...
Read More...
National  International  

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు): పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు. AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International...
Read More...