ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు
- భోలక్ పూర్ లో ఉచిత వైద్య శిభిరం
సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు):
ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ అందుకు అనుగుణంగా వైద్యం పొందాలని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు అన్నారు. శుక్రవారం జనహిత సేవా ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్, కిమ్స్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో భోలక్ పూర్ లోని ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మానవ సేవే మాధవ సేవ అని, పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ శిబిరంలో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ లు 175 మందికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షించి, ఆరోగ్య సలహాలను, మందులు కూడా అందజేశారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పరీక్షించి, రక్తహీనత ఉన్నవారికి ఐరన్ టాబ్లెట్లను అందజేశారు. ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఎం. శ్రీనివాస్ ఒంటినొప్పులు ఉన్నవారికి ఎక్సర్ సైజ్ లను చూపించారు. జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి, నర్సింగ్ రావు, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నాగ శేఖర్ గుప్తా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, సతీష్ కుమార్, బాలభారతి, సుజాత శివరామకృష్ణ, ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, వెంకటేష్, ఎల్లేశ్వర్, జానకిరాం, బిజెపి నాయకులు టి. రాజశేఖర్ రెడ్డి, శివలింగం, మహేష్, కిషన్, రఘురాం, హరినాథ్, నాగరాజు, కిషన్ లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
