పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
(చెరుకు మహేశ్వర శర్మ - రాయికల్ జగిత్యాల - 8106288921
జగిత్యాల 14 మే (ప్రజా మంటలు) :
సమస్తప్రాణికోటి మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి పుట్టింది.నదుల సమీపంలోనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి నీళ్ళకు దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.ఆ నదులకు ప్రత్యేకత కల్పించి రుషులు, మహర్షులు పుష్కరాలు ఏర్పాటుచేశారు .
బృహస్పతి గ్రహం రాశి మార్పును అనుసరించి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు గా నిర్ధారించారు . బృహస్పతి మిధున రాశిలో ప్రవేశిస్తున్న సందర్భంలో పవిత్ర సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి. మన హైందవ ధర్మం లో ప్రతి నదికి ఒక ప్రత్యేకత ఉంది నదులు అన్నింటిని దేవతగా పరిగణించి పూజించే సంప్రదాయం హైందవసాంప్రదాయం.
హిందువులు స్నానం చేసే సమయంలో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు
అనే శ్లోకాన్ని చదువుతూ నదీమ తల్లులను స్మరిస్తూ ఉంటారు.
దీని ద్వారా నదీనదాలకు భారతీయులు ఇచ్చిన ప్రాముఖ్యత తెలుస్తుంది. పుష్కర రాజు బృహస్పతి గ్రహం ప్రవేశించే రాశిని అనుసరించి ఒక్కొక్క నదికి పుష్కరాలు మొదలవుతాయి. ఈ నెల 14 వ తేది రాత్రి బృహస్ఫతి గ్రహం మిధున రాశిలో ప్రవేశిస్తున్న సందర్భంలో వైశాఖ బహుళ తదియ గురువారం నుండి సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి.
పిప్పలాదత్సముత్పన్నే కృత్తే లోక భయంకరి ! సైకతంతే మయాదత్త మాహారార్థం ప్రకల్ప్యాతామ్.!!
తీర్థ రాజా నమస్తుభ్యం సర్వలోకైక పావన!త్వయి స్నానం కరోమ్యద్య భవ బంధ విముక్తయే!!
మిధునాగతే దేవ గురౌ పితౄణాం తారణాయ చ ! సర్వపాప విముక్త్యర్థం తీర్థ స్నానం కరోమ్యహం !!
పుష్కర కాలం హిందువులు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
పితృదేవతలకు మాతృ దేవతలకు పిండప్రదానాలు చేయడం తర్పణాలు వదలడం దానధర్మాలు చేయడం వంటి ఆచారాలను ఆచరించడం ద్వారా మన పూర్వీకులను ప్రార్థించడానికి, గౌరవించడానికి మంచి సమయంగా భావిస్తారు .
గంగ యమునా సంగమం వద్ద సరస్వతీ నదిని అంతర్వాహినిగా ఉంది దీనిని త్రివేణి సంగమం గా పరిగణిస్తారు. వేదాలలో పురాణాలలో ఇతిహాసాలలో సరస్వతీ నది ప్రస్తావన ఉంది.
విద్యలకు అధిదేవత సరస్వతి శాపవశాత్తు నదిగా మారిందని కథలు ఉన్నాయి. బ్రహ్మాండ పురాణ కథ ప్రకారం ఈశ్వరుని యొక్క ఆది అంతాలను కనుగొన్నాలన్న బ్రహ్మదేవుడి సంకల్పం ఫలించలేదు. కానీ పరమేశ్వరుని తుది కనుగొన్నట్టు విధాత ,శివుని తోనే అసత్యం చెప్పడంతో మహదేవుడు ఆగ్రహించి బ్రహ్మ వాక్కు అయినా సరస్వతిని నదిగా మారిపోవాలని శపించారట ..అలా సరస్వతీ నది హిమాలయాల్లో శివాలిక్ పర్వతాల్లోని సిరిమూరు కొండల్లో పుట్టినదని, బ్రహ్మ సరస్సు లేదా బదరికాశ్రమంలో పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి.
సరస్వతీ నది మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమేలీ జిల్లాలో గల పవిత్ర బద్రీనాథ్ క్షేత్రమునకు ఉత్తర భాగంలో ఐదు కిలోమీటర్ల దూరంలో మానా గ్రామం వద్ద హిమాలయాల్లోని శివాలిక్ పర్వత భక్తుల్లో ప్లక్ష ప్రసవనగిరిపై శమ్యాప్రాశనం అను ప్రాంతంలో కొండ శిలల మధ్య నుండి భయంకరమైన శబ్దముతో ఉవ్వెత్తుఅలలతో ఉద్భవించినది .ఈ ప్రాంతంలో వ్యాసగుహ గణపతిగుహ లు కలవు. ఇక్కడ వేద వ్యాసుడు చెప్పగా గణపతి అష్టాదశ పురాణాలు రాశాడని ప్రతీతి.
పాండవులు మహాప్రస్థానం చేయుచూ సరస్వతీ నది తీరమునకువచ్చి సరస్వతీ నదిని దాటుటకు వీలుకాక పోయేసరికి భీముడు ఒక పెద్ద బండరాయిని వంతెనగా వేశాడని చెపుతారు.ఈ ప్రాంత సమీపంలోనే పాండవులు తమ దేహాల్ని విడిచారని మహాభారతం చెబుతుంది.
ఒకప్పుడు భారతావనిలో పెద్ద నదిగా ప్రవహించిన సరస్వతి నది ఇప్పుడు అదృశ్య అంతర్వాహినిగా సాగుతుంది.
భూకంపాలు అగ్ని విస్పోటాలు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా సరస్వతీ నది క్షీణించి చివరకు కని కనిపించని అంతర్వాహినిగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం. కురుక్షేత్రం సమీపంలోని విషాశన అనే చోట అంతర్దానమైందని చెప్తారు .సరస్వతి నది మానా గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అలకానందలో కలుస్తుంది. ఆ ప్రదేశాన్ని కేశవ ప్రయాగ అంటారు. ఆ తర్వాత అలహాబాద్ వద్ద గంగా యమునలతో కలుస్తూ అక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది.ఈ నది ప్రాంత సమీపంలో గర్గర్ నది వంటి ఉపనదులు ప్రవహిస్తుండగా వాటిని స్థానికులు సరస్వతీ పేరుతో వ్యవహరిస్తారు.
సరస్వతి నది పుష్కర పుణ్య స్నానానికి రాజస్థాన్ రాష్ట్రంలోని బ్రహ్మసరోవరం, గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ జ్యోతిర్లింగాలయం సిద్దాపురాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేడాఘాట్ ప్రాంతం ముఖ్యమైన ప్రదేశాలు.
తెలంగాణ రాష్ట్రం లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలం కాళేశ్వరంలో గోదావరి ప్రాణహిత సంగమ ప్రదేశంలో సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కాళేశ్వర త్రివేణి సంగమం అంటే గోదావరి సరస్వతి ప్రాణహిత నదుల సంగమ స్థలం .ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోయి పూర్వ జన్మ నుంచి విముక్తి లభిస్తుంది నమ్మకం.
ఈనెల 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతీనది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు.
గంగా హారతి లాగే పుష్కర సమయంలో గోదావరి హారతి నిర్వహిస్తున్నామని అన్నారు. పుష్కరాల్లో విపత్తు బృందాల సైతం సేవలందిస్తాయని ఆయన తెలిపారు.
15 మే నుండి 26 మే వరకు 12 రోజుల పాటు జరిగే సరస్వతీ నది పుష్కరాల సమయంలో సరస్వతీ నదిలో స్నానం చేసి త్రికరణశుద్ధిగా మాతృ పితృదేవతలకు పిండ పదాలు తర్పణములు చేసి యధాశక్తి దానములు ఎవరైతే చేయుదురో అట్టివారు సకల పాపముక్తులవుతారు వారి వారి మనసుల్లో ఏ కోరికలైతే ఉంటాయో అవి మాతృ పితృదేవత అనుగ్రహం వల్ల తప్పక నెరవేరుతాయని హిందువుల విశ్వాసం..
పురాణాలు,ధర్మశాస్త్రములను అనుసరించి పుష్కర సమయంలో యధాశక్తి చేయవలసిన దానములు :
- ఒకటవ రోజు బంగారము భూమి ధాన్యములు
- రెండవ రోజు ఆవులు ఉప్పు వస్త్రములు
- మూడవరోజు బెల్లం ఆకుకూరలు వస్త్రములు ఆవులు
- నాలుగవ రోజు పాలు పెరుగు నెయ్యి తేనే చక్కెర
- ఐదవ రోజు ధాన్యములు ఎద్దులు, నాగలి
- ఆరవ రోజు గంధం చెక్కలు సుగంధ ద్రవ్యములు పరిమళభరిత పుష్పాలు
- ఏడవ రోజు గృహములు శయ్యలు ఫలములు తాంబూలాలు వెండి పాత్రలు
- ఎనిమిదవ రోజు పంచలోహములు పండ్లు కూరగాయలు, పుష్పాలు వస్త్రములు.
- తొమ్మిదవ రోజు వస్త్ర దానం సేవకాదానం పాదరక్షలు
- పదవ రోజు రాగిపాత్రలు ముత్యములు పగడములు
- పదకొండవ రోజు భక్తికి సంబంధించిన పుస్తకములు జపమాలలు యజ్ఞోపవీతములు వాహనాలు
- పన్నెండవ రోజు నువ్వులు నూనెలు ఏనుగులు గుర్రములు మేకలు.
అంతర్వాహిని గా ప్రవహించే సరస్వతీ నది పుష్కరాల సమయంలో నదీస్నానం చేయడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి
