సనత్ నగర్ లో ఏఐసీసీ మెంబర్ కోట నీలిమా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
సికింద్రాబాద్, మే16 (ప్రజామంటలు):
ఏఐసీసీ మెంబర్,రచయిత్రి డాక్టర్ కోట నీలిమా గురువారం సనత్ నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. బల్కంపేట అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేశంలో శాంతి నెలకొనాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం అనాథ పిల్లలకు వారి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులనుపంపిణీ చేశారు. గాంధీ ఆసుపత్రిలో దివ్యాంగుల కోసం ఉద్దేశించిన వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఐడీహెచ్ కాలనీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పాత కస్టమ్స్ భవన్ లో రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. అమీర్ పేట లో ఎండ వేడిమి నుంచి ప్రజలు సేదా తీరేందుకు చలివేంద్రాలను ప్రారంభించారు. దాసారం బస్తీలో అన్నదానం నిర్వహించి, సనత్ నగర్ బస్టాప్ వద్ద పేద మహిళలకు చీరల పంపిణీ నిర్వహించారు. ఈసందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ...తన పుట్టిన రోజున అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించిన డాక్టర్ కోట నీలిమా ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లకు చెందిన పార్టీ ప్రెసిడెంట్ లు, మహిళా విభాగం నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
