తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?
మహిళా కమిషన్ కు బీఆర్ఎస్ మహిళా నేతల ఫిర్యాదు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు.
సికింద్రాబాద్ మే15 (ప్రజామంటలు):
విశ్వసుందరి పోటీల నేపథ్యంలో వరంగల్ రామప్ప దేవాలయానికి వచ్చిన విశ్వసుందరిల పాదాలను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలతో కడిగించి అవమానించారని బి అర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు గురువారం తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు ఫిర్యాదు చేశారు. బిఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ళ శారదకు ఫిర్యాదు చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఆడపడుచులను అవమానించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చర్యలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గొప్ప పేరు రావాలంటే వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ మహిళా మంత్రుల చేత విశ్వసుందరుల కాళ్ళను కడిగించాల్సిందని అన్నారు. ఇలాంటి చర్యల మూలంగా తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. విశ్వసుందరి పోటీదారులు రామప్ప దేవాలయం వద్ద బతుకమ్మను అగౌరవపరిచే విధంగా కాళ్లకు పాదరక్షలు ధరించి బతుకమ్మ ఆడించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె మండిపడ్డారు. తెలంగాణ మహిళల పట్ల చిన్నచూపు, వివక్ష వైఖరి ప్రదర్శించడం సరికాదన్నారు.బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్వాయి స్రవంతి,కార్పొరేటర్లు సామల హేమ,కంది శైలజ, రాసూరి సునీత తో పాటు అర్పిత, డా.సత్య,అరుణ, రమాదేవి పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?

భూమాతకు బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి
